'మహా సముద్రం' ప్రీమియర్ షో టాక్

First Published | Oct 14, 2021, 9:29 AM IST

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

Maha Samudram

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

రావు రమేష్ , జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ రొమాన్స్ ఉన్నప్పటికీ బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డైలాగులకు విశేష స్పందన లభించింది. దసరా కానుకగా ఈ చిత్రం నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. ఇండియాలో కూడా షోలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మహాసముద్రం చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం. 


ఈ చిత్రంలో Sharwanand, సిద్ధార్థ్ ఇద్దరూ స్నేహితులుగా కనిపిస్తారు. ఈ ఇద్దరు స్నేహితుల జీవితంలో జరిగిన కథే మహాసముద్రం చిత్రం. వీరిద్దరిలో Siddharth ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటూ అందుకోసం ప్రిపేర్ అవుతుంటాడు. సినిమా మొదలైన 20 నిమిషాల లోపే అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్ తో పాటు విలన్ పాత్ర కూడా పరిచయం అవుతుంది. 

సినిమా స్లోగా ఉన్నపటికీ మంచి కమర్షియల్ అంశాలతో దర్శకుడు కథని నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే శర్వానంద్ మార్కెట్ ఫైట్ అద్భుతంగా ఉంటుంది. శర్వానంద్.. అను ఇమ్మాన్యుయేల్ ని ప్రేమిస్తుంటాడు. అను న్యాయ శాస్త్రం చదివే స్టూడెంట్. ఇక సిద్ధార్థ్ ప్రేయసి అదితి డాన్స్ టీచర్ గా ఉంటుంది. 

maha samudram

యాక్షన్, రొమాన్స్ తో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ వరకు కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ ఇంటర్వెల్ సన్నివేశంతో కథలో ఊపు వస్తుంది. కథలో పాత్రలు, లొకేషన్స్ అన్ని అంశాలు మాస్ ని ఆకట్టుకునేలా ఉంటాయి. బిజియం బావున్నప్పటికీ పాటలు ఆశించిన స్థాయిలో లేవు. 

Also Read: నాగార్జున ఆశలన్నీ పూజా హెగ్డే పైనే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ సైడ్ టాక్ ఏంటి?

Maha Samudram Theme Poster

కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లుగా అనిపిస్తాయి. దర్శకుడు Ajay Bhupathi ఈ చిత్రం కోసం రాసుకున్న పాత్రలు, కొన్ని హై మూమెంట్స్, నటీనటుల పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన అంశాలు. ఏం జరగబోతోందో ముందుగానే ఊహించదగిన సెకండ్ హాఫ్ ఈ చిత్రానికి మైనస్ గా మారింది. ఓవరాల్ గా నటీనటుల అద్భుతమైన పెర్ఫామెన్స్, కొన్ని మెప్పించే కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం దసరా సీజన్లో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. 

Also Read: "పుష్ప" పాత్రకి ఆ లోపం, శ్రీవల్లి పాటలో లీక్,బన్ని కి చాలా కష్టం

Latest Videos

click me!