నాగార్జున ఆశలన్నీ పూజా హెగ్డే పైనే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ సైడ్ టాక్ ఏంటి?

First Published | Oct 14, 2021, 7:49 AM IST

అఖిల్ హిట్ కొడితే చూసి అందించాలని కింగ్ నాగార్జున ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఫస్ట్ మూవీ 'అఖిల్'తో గ్రాండ్ గా లాంచ్ చేసినప్పటికీ ఆ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. 

అఖిల్ హిట్ కొడితే చూసి అందించాలని కింగ్ నాగార్జున ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఫస్ట్ మూవీ 'అఖిల్'తో గ్రాండ్ గా లాంచ్ చేసినప్పటికీ ఆ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. దీనితో టాలీవుడ్ పై అఖిల్ ఇంపాక్ట్ ఇంకా పడలేదు. అఖిల్ టాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ గా అంచనాలు ఉన్నాయి. ఒక హిట్ కొడితే కానీ అవన్నీ లెక్కలోకి రావు. ఎందుకంటే చివరగా స్టార్ డమ్ తీసుకువచ్చేది బాక్స్ ఆఫీస్ లెక్కలే. 

ఇదిలా ఉండగా Akhil Akkineni లేటెస్ట్ మూవీ ' మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' దసరా కానుకగా అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ చిత్రంపై మంచి బజ్ ఉన్నప్పటికీ అదంతా మల్టి ఫ్లెక్స్ వరకే పరిమితం అని అంటున్నారు. ఎందుకంటే మోస్ట్ లిజిబుల్ బ్యాచిలర్ మాస్ చిత్రం కాదు. క్లాస్ టచ్ ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్. పైగా ఈ చిత్ర దర్శకుడు Bommarillu Bhaskar పై కూడా పెద్దగా అంచనాలు లేవు. ఆరెంజ్, ఒంగోలు గిత్త లాంటి డిజాస్టర్ చిత్రాల తర్వాత భాస్కర్ బాగా గ్యాప్ ఇచ్చారు. 


మ్యాజిక్ వర్కౌట్ అయి సూపర్ హిట్ టాక్ వస్తే గానీ జనాలు తొలి రోజు నుంచే ఈ చిత్రానికి ఎగబడడం కష్టం అనే ఫీలింగ్ ట్రేడ్ లో ఉంది. ఆ మ్యాజిక్ చేయాల్సిన భారం మొత్తం Pooja Hegde పైనే ఉందని అంటున్నారు. చిత్ర యూనిట్ తో పాటు నాగార్జున కూడా పూజా హెగ్డే పై బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారట. యువతని ఆకర్షించే సత్తా పూజా హెగ్డేకి ఉంది. వరుస హిట్స్ తో పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. 

ఇక Most Eligible Bachelor ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించరా అనే ఫీలింగ్ కలుగుతుంది. సింగిల్ స్క్రీన్స్ లో ఈ చిత్రం రాణించాలంటే అఖిల్ కంటే పూజా హెగ్డే క్రేజే పనిచేయాలి. 

దసరా ఫెస్టివ్ సీజన్ లో వస్తుండడం ఈ చిత్రానికి కలసి వచ్చే అంశం. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లకు డోకా ఉండదు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆ వసూళ్లు ఎంతమేరకు ఉంటాయి అనేది మాత్రం పూజా హెగ్డే మ్యాజిక్, బొమ్మరిల్లు భాస్కర్ టేకింగ్, కథపైనే ఆధారపడి ఉంటాయి. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా కీలక పాత్రలో నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read: మెలికలు తిరుగుతూ ఒంపుసొంపులతో హీట్ అమాంతం పెంచేస్తున్న 'లోఫర్' బ్యూటీ

Latest Videos

click me!