బిగ్‌బాస్ హౌజ్‌లో సిరి, జెస్సీ, తాను ఫ్రెండ్స్ గా ఉన్నారు. అయితే గత వారంలో ఈ వారం జరిగిన టాస్క్ ల్లో, గేముల్లో Shanmukh సొంతంగా, ఒంటరిగానే గేమ్ ఆడాడు. ఎవరిపై ఆధారకుండా, ఎవరికి సపోర్ట్ చేయకుండా తన గేమ్ తాను ఆడాడు. ఆయన గేమ్‌ని, స్ట్రాటజీలను హోస్ట్ నాగార్జున కూడా అభినందించడం విశేషం. శనివారం(నేడు) జరిగిన ఎపిసోడ్‌లో నాగ్ షణ్ముఖ్ ఆట తీరుని, టాస్క్ ల కోసం ఫ్రెండ్స్ నికూడా పక్కని పెట్టి ఆడిన తీరుని అభినందించారు. కెప్టెన్‌గానూ అందరిని సమానంగా చూశావని, నీట్‌గా హౌజ్ ఉండేలా చేశావని, ఫనీష్‌మెంట్లు కూడా సమానంగా వేశావని ప్రశంసించారు.