బిగ్ బాస్ తెలుగు 5( Bigg Boss Telugu 5) ఎపిసోడ్ 95 ఆసక్తికరంగా సాగింది. సరదాగా ఉంటూనే ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ గా ఆర్గుమెంట్ జరిగింది. కాజల్, మానస్ ఇద్దరూ సీక్రెట్ గా షణ్ముఖ్, సిరి రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. షణ్ముఖ్ పూర్తిగా సిరిని కంట్రోల్ చేస్తున్నాడు అని మానస్.. కాజల్ తో అంటాడు. సిరి మానస్ ని ఇష్టపడుతోంది అని కాజల్ బదులిస్తుంది. లివింగ్ ఏరియాలో సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ మొదలవుతుంది. షణ్ముఖ్ ని సన్నీ ఇమిటేట్ చేస్తాడు. దీనితో షణ్ముఖ్ కి కోపం వస్తుంది.