రాజమౌళికి వర్కౌట్ అవుతోంది..శంకర్ కి తేడా కొడుతోంది అదే.. ఇద్దరిలో అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే ?

Published : Jul 13, 2024, 06:50 PM IST

భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ వెర్సస్ రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. పాన్ ఇండియా స్థాయిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అనే చర్చ జరుగుతోంది.   

PREV
19
రాజమౌళికి వర్కౌట్ అవుతోంది..శంకర్ కి తేడా కొడుతోంది అదే.. ఇద్దరిలో అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే ?

ఇండియన్ స్క్రీన్ పై భారీ చిత్రాలు తెరకెక్కించాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది శంకర్. శంకర్ యూత్ ఫుల్ స్టోరీలు, సందేశాత్మక చిత్రాలు, భారీ విజువల్స్ ఉండే చిత్రాలు, పొలిటికల్ మూవీస్ ఇలా చాలా రకాల చిత్రాలని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. రాజమౌళి వచ్చాక శంకర్ కి అసలైన పోటీ ఇచ్చే దర్శకుడు వచ్చాడని అంతా ప్రశంసించారు.  

29

కానీ ఇప్పుడు సక్సెస్ విషయంలో శంకర్ వెనుకబడగా.. రాజమౌళి పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. ఐ చిత్రం నుంచి శంకర్ కి అంతగా కలసి రావడం లేదు. రీసెంట్ గా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ నిరాశాజనకంగా ఉంది. శంకర్ మార్క్ పూర్తిగా బెడిసికొట్టింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. శంకర్ కి మరొక షాక్ తగలడంతో సోషల్ మీడియాలో శంకర్, రాజమౌళిని పోల్చుతూ నెటిజన్లు ఎవరు గొప్ప అనే పోస్ట్ లు పెడుతున్నారు. 

39
Shankar

శంకర్ బలం ఏంటి.. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే అంశాలని.. అదే విధంగా రాజమౌళి బలాబలాలని విశ్లేషిస్తున్నారు. ముందుగా భారతీయుడు 2 చిత్రం విషయంలో వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే.. ఎప్పుడో 28 ఏళ్ళ క్రితం వర్కౌట్ అయిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 

49
indian 1996

శంకర్ జడ్జిమెంట్ కథల విషయంలో బెడిసికొట్టడానికి ఒక కారణం ఉంది. గతంలో ఆయన టీంలో పేరుగాంచిన రచయిత సుజాత ఉండేవారు. శంకర్ చిత్రాల కథల విషయంలో ఆయన సహకారం ఎంతైనా ఉంది. 2008లో సుజాత మరణించిన తర్వాత శంకర్ కి సినిమాల విషయంలో ఇబ్బందులు మొదలయ్యాయి. 

59

శంకర్ ఎంచుకునే కథల్లో కాస్త గందరగోళం ఉంటుంది. కానీ తన విజన్, విజువల్స్ తో సామాన్యులు సైతం ఎంజాయ్ చేసేలా ఆలోచించేలా శంకర్ అవుట్ పుట్ తీసుకువస్తారు. ఉదాహరణకి అపరిచితుడు చిత్రాన్ని ఇంకెవరైనా డైరెక్ట్ చేసి ఉంటే ఆ సినిమా పరిస్థితి ఏంటి అసలు ఊహించుకోలేం. అంతటి సంక్లిష్టత ఉన్న కథల్లో కూడా శంకర్ మాస్, ఎంటర్టైనింగ్ అంశాలు రాబడతారు. శంకర్ బలం అదే. ఇటీవల శంకర్ సినిమాల్లో ఆ బలమే మిస్ అవుతుండడంతో కథలు తేలిపోతున్నాయి. 

 

69
Rajamouli

ఒకే ఒక్కడు చిత్రం విషయంలో ఆ సమయంలో ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ ని ఎవరూ ఊహించి కూడా ఉండలేరు. శంకర్ తన దర్శకత్వ మ్యాజిక్ తో అందులో కూడా ఎంటర్టైన్మెంట్ రాబడుతూ అదరగొట్టేశాడు. ఇక రాజమౌళి విషయానికి వస్తే.. జక్కన్న ఎంచుకునే కథల్లో ఎలాంటి గందరగోళం ఉండదు. ఒక వేళ అలాంటి అంశాలు ఉన్నా రాజమౌళి ముందే క్లారిటీ ఇచ్చేస్తారు. 

79

తన తండ్రి దగ్గర రాజమౌళి కథ తీసుకుంటారు. ఆ కథని జక్కన్న తన విజన్ కి తగ్గట్లుగా మార్పులు చేయించుకుంటారు. ఆడియన్స్ ని అబ్బురపరిచే అంశాలని కథకి జోడిస్తారు. రాజమౌళి ఎంత పెద్ద కథ తీసినా నేల విడిచి సాము చేయడు. ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనే డెసిషన్ స్క్రిప్టింగ్ దశలోనే రాజమౌళి తీసుకుంటాడు. బాహుబలి, మగధీర, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలని గమనిస్తే భారీ కథ ఉన్నట్లు అనిపిస్తుంది. 

89

కానీ అందులో ప్రధాన అంశం అన్ని వర్గాల ఆడియన్స్ కి అర్థం అయ్యేలా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ కథని భారీ విజువల్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ తో రాజమౌళి గ్రాండియర్ గా మార్చేస్తారు. ఈగలాంటి ప్రయోగాత్మక సినిమా చేసినా అందులో ప్రధానంగా కనిపించేది ప్రేమ, రివేంజ్ మాత్రమే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల మధ్య స్నేహాన్ని కల్పించి  కథ రాసుకున్నారు. ఆ తర్వాత ఎప్పటిలాగే తన స్టైల్ లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ తో అలరించారు. 

99
SS Rajamouli

రాజమౌళి అనవసరమైన సీక్వెల్స్ జోలికి వెళ్ళరు. బాహుబలి చిత్రానికి ఆల్రెడీ కథ సిద్ధం అయిపోయింది. ఉన్న కథని రెండుగా డివైడ్ చేశారు. ఈ విషయంలో శంకర్ కాస్త రాంగ్ ట్రాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయుడు వర్కౌట్ అయింది కాబట్టి భారతీయుడు 2.. రోబో వర్కౌట్ అయింది కాబట్టి 2.0.. అపరిచితుడు వర్కౌట్ అయింది కాబట్టి ఐ చిత్రాలని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. ఐ సీక్వెల్ కథ కానప్పటికీ విక్రమ్ తో మల్టిపుల్ గెటప్స్ వేయిస్తే సూపర్ హిట్ అవుతుందని భావించి శంకర్ ఆ చిత్రం చేసినట్లు అర్థం అవుతోంది. రాజమౌళి, శంకర్ ఎవరూ ఎవరికీ తీసిపోరు. కానీ రాజమౌళి అనవసరమైన అంశాల జోలికి పోకుండా తన చిత్రాలని వర్కౌట్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. శంకర్ ఇకపై సీక్వెల్స్ జోలికి పోకుండా ఫ్రెష్ థాట్ తో వస్తే ఆడియన్స్ ఆదరించడానికి రెడీగా ఉన్నారు. 

click me!

Recommended Stories