ఈ క్రమంలో మధ్యలోనే కొందరు ఆమెకి ఆఫర్లు రాకుండా చేశారని అర్థమవుతుంది. కొంత గ్యాప్‌తో సదా మళ్లీ సినిమాలు చేసింది. `ప్రాణం`, `నాగ`, `దొంగా దొంగది`, `లీలా మహల్ సెంటర్`, `ఔనన్నా కాదన్నా`, `అపరిచితుడు`, `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `టక్కరి`, `మైత్రీ` వంటి సినిమాల్లో మెరిసింది సదా. కానీ ఆమె తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం, తగిన గుర్తింపు రాకపోవడానికి సంబంధించిన తనకు కూడా అర్థం కాలేదని చెప్పింది సదా. ఏం జరిగిందో అర్థం కాలేదు. చాలా మంది తనకు ఆఫర్ చేశామని అన్నారు, కానీ నా వరకు రాకపోవడమే వింతగా అనిపించింది.