శంకర్ కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్న విజయ్ దళపతి డైరెక్టర్‌ ఎవరు?

Published : Mar 18, 2025, 03:58 PM IST

Shankar Son Arjith Actor Debut: సౌత్ స్టార్  డైరెక్టర్ శంకర్  కొడుకు అర్జిత్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తన తనయుడి సినిమాను తాను డైెరెక్ట్  చేయకుండా మరో దర్శకుడి చేతిలో పెట్టాడట శంకర్. ఇంతకీ శంకర్ వారసుడిని  పరిచయం చేయబోతున్నా స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా? 

PREV
14
శంకర్ కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్న  విజయ్ దళపతి  డైరెక్టర్‌ ఎవరు?

Shankar Son Arjith Actor Debut:  ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా వెలుగొందిన శంకర్, ఈ మధ్య తీసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఆఖరిగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో ఆయన మార్కెట్ దారుణంగా పడిపోయింది. 

Also read: రస్నా యాడ్ లో ఉన్న చిన్నారి, రాజమౌళి హీరోయిన్ ఎవరో తెలుసా?

24
అదితి శంకర్

డైరెక్టర్ శంకర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య సినిమా వైపు చూడలేదు. ఎవరూ ఊహించని విధంగా శంకర్ చిన్న కూతురు అదితి, విరుమన్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత శివకార్తికేయన్‌తో కలిసి మావీరన్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

Also read:మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?

 

34
అర్జిత్ శంకర్, అదితి శంకర్

ఇటీవల శంకర్ కొడుకు అర్జిత్ కూడా  హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అతను డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. అయితే దర్శకుడిగా కంటే ముందు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. శివకార్తికేయన్ నటించిన మద్రాసి సినిమాలో అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా అర్జిత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని శంకరే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Also read:నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

44
ప్రభుదేవా

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ కొడుకు అర్జిత్ త్వరలోనే కోలీవుడ్‌లో హీరోగా పరిచయం కాబోతున్నాడట. ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. ప్రభుదేవా ఇదివరకే విజయ్‌తో పోకిరి, విల్లు, జయం రవితో ఎంగేయుమ్ కాదల్ లాంటి సినిమాలు తీశాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుందని భావిస్తున్నారు.

Also read:నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్

 

Read more Photos on
click me!

Recommended Stories