Director Shankar
సౌత్ సినిమాకు పాన్ ఇండియా స్థాయి తెచ్చిన దర్శఖుడు శంకర్. ఆయన సినిమాలు సౌత్ భాషలతో పాటు నార్త్ లో కూడా మంచి మార్కెట్ అయ్యేవి. తమిళ సినిమా శంకర్ ను చూసి గర్వపడేది. కాని దాదాపు దశాబ్ధం కాలంగా శంకర్ సినిమాల్లో ఆమ్యాజిక్ మిస్ అవుతోంది.
ఆయన ఏ సినిమా చేసినా అది అయితే ప్లాప్ లేకుంటే డిజాస్టర్. మరీముఖ్యంగా రోబో సినిమా తరువాత శంకర్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. రోబో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత దాదాపు అరడజన్ సినిమాలకు పైగా చేశాడు శంకర్.
Also Read: 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
కాని ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించకపోవగా.. యావరేజ్ గా కూడా నిలవలేదు. అంతే కాదు రీసెంట్ గా ఆయన మొదటి సారి రామ్ చరణ్ హీరోగా తెలుగులో డైరెక్ట్ పిక్చర్ చేశారు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉండగా..ఈసినిమా కూడా దారుణమైన ఫలితాన్నే ఇచ్చింది. అయితే ఇలా శంకర్ సినిమాలు ప్లాప్ అవ్వడంలో ఒక కారణం కనిపిస్తోంది. రోబో సినిమా వరకు శంకర్ సినిమాల్లో ఉన్న మ్యాజిక్ ఆతరువాత సినిమాల్లో కనిపించలేదు.
Also Read: విజయ్ దళపతి వారసుడికి మాట ఇచ్చిన అజిత్, ఇంతకీ విషయం ఏంటి..?
దానికి ఒక వ్యక్తి కారణం అని తెలుస్తోంది. అతను ఎవరో కాదు సుజాత రంగరాజన్. అవును శంకర్ టీమ్ లో ఇతను లేని కొరత స్పస్టంగా కనిపిస్తుంది. సుజాత మార్క్ మిస్ అవ్వడం వల్లే శంకర్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా సుజాత రంగరాజన్ అంటే... ఆయనో రచయిత. శంకర్ టీమ్ లో మొదటి రెండు మూడు సినిమాలకు తప్పిస్తే ప్రతి సినిమాకు సుజాత రంగరాజన్ పనిచేసారు. శంకర్ కు కుడి భుజంగా ఉండి కథ, కథనం, డైలాగ్స్ ని డెవలప్ చేసారు.
Also Read: దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.
అయితే శంకర్ సినిమాలో సూపర్ హిట్ అయిన రోబో వరకూ ఈయన పనిచేశారు. 2008లో సుజాతా రంగరాజన్ మరణించారు. కాని అప్పటికే రోబో సినిమాకు కావలసిన పనిచేసిన తరువాతే ఆయన తనువు చాలించారు.రోబో మూవీ షూటింగ్ లో ఉండగా సుజాత రంగరాజన్ చనిపోయారు. ఇక రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంరదికి తెలుసు. ఇక ఆ తర్వాత నుంచే శంకర్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ మిస్ అవుతూ వచ్చింది.
సుజాత రంగరాజన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది అంటూ గతంలోనే తమిళ మీడియా మొత్తుకుంది. ఇక శంకర్ సినిమాలు డిజాస్టర్స్ అయినప్పుడు అందరు ఆయన్ను గుర్తు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా భారతీయుడు సినిమాకు సుజాత పనిచేశారు. అది బ్లాక్ బస్టర్ హిట్. కాని రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 డిజాస్టర్ అయినప్పుడు అందరూ సుజాత రంగరాజన్ నే తలుచుకున్నారు.
Shankar Movies
ఇలా ఆయన గైడెన్స్ లేక, కథ విషయంలో శంకర్ నిర్ణయాలు వల్ల ఇదంతా జరుగుతంది అని ఆడియన్స్ అభిప్రాయం. మరి ముందు ముందు ఈ విషయంలో శంకర్ కాస్త జాగ్రత్త పడతాడా..? లేక ఇలానే ప్లాప్ లు ఇస్తారా అనేది చూడాలి. ఇక శంకర్ త్వరలో భారతీయుడు 3ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో చూడాలి.