తెలుగులో హీరోగా చేసిన ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి ఎలా చనిపోయాడు? లైఫ్‌లో ఇంతటి విషాదం ఉందా?

First Published | Jan 14, 2025, 4:49 PM IST

`సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో భాగ్యంగా వెంకీ భార్యగా చేసి రచ్చ చేసింది ఐశ్వర్య రాజేష్‌. ఆమె తండ్రి తెలుగులో హీరో అనే విషయం తెలుసా? సినిమాల లిస్ట్ పెద్దదే. 
 

ఐశ్వర్యా రాజేష్‌ తెలుగు అమ్మాయి అయినా తమిళంలో హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడ స్టార్‌డమ్‌ అందుకుంది. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా సక్సెస్‌ కాలేకపోయింది. ఆమె నటించిన సినిమాలు ఆడకపోవడంతో ఐష్‌ టాలెంట్‌ బయటకు రాలేదు. తాజాగా ఆమె వెంకటేష్‌ తో కలిసి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వహించిన ఈ మూవీలో వెంకీకి జోడీగా చేసింది. 

ఈ మూవీ సంక్రాంతి కానుకగా నేడు మంగళవారం సినిమా విడుదలైంది. మూవీకి పాజిటివ్‌ టాక్ వస్తుంది. అయితే ఇందులో ఐశ్వర్యా రాజేష్‌ పాత్ర హైలైట్‌ అవుతుంది. వెంకీకి భార్యగా ఆమె రెచ్చిపోయింది. వెంకీని ప్రేమగా చూసుకునే భార్యగా, ఆయనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ ఉందని తెలిసి అనుమానంతో ఆడుకునే భార్యగా రెండు షేడ్స్ చూపించి మెప్పించింది. ఇందులో ఐశ్వర్యా పాత్ర అందరిని అలరిస్తుంది. వెంకటేష్‌ పాత్రని కూడా డామినేట్‌ చేసే రేంజ్‌లో ఆమె పాత్ర ఉండటం విశేషం. 


దీంతో అంతా ఐష్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యా రాజేష్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్‌ ఫ్యామిలీ గురించి, ఆమె ఫాదర్‌ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి రాజేష్‌ తెలుగు వారు. ఆయన తెలుగులో హీరోగా కూడా సినిమాలు చేశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన `నెలవంక` మూవీలో రాజేష్‌ హీరోగా నటించారు. సలీమ్‌ పాత్రలో అదరగొట్టారు. 
 

ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే `రెండు జళ్ల సీత`, `ఆనంద భైరవి` సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన `పల్లెటూరి మొనగాడు`, బాలకృష్ణ హీరోగా నటించిన `సీతారామకళ్యాణం`, కృష్ణంరాజు హీరోగా నటించిన `ధర్మాత్ముడు`, `బొబ్బిలి బ్రహ్మాణ్ణ`, అలాగే `ఆనందభైరవి` చిత్రాల్లో విలన్‌గా నటించారు. వీటితోపాటు యాభైకి పైగా సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నారు. 
 

నటుడిగా రాణిస్తున్న సమయంలో తాగుడికి బానిసయ్యాడు రాజేష్‌. విపరీతంగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. లివర్‌ డ్యామేజ్‌ అయ్యింది. దీంతో తన 38ఏళ్ల వయసులోనే కన్నుమూశారు రాజేష్‌. అప్పటికే ఐశ్వర్య రాజేష్‌ ఏజ్‌ ఎనిమిదేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే తండ్రి మరణంతో తల్లి నాగమణినే అంతా చూసుకుంది. పెంచి పెద్ద చేసింది. హీరోయిన్‌ని చేసింది.

ఐశ్వర్యా రాజేష్‌ తమిళంలో హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆ మధ్య `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాలు చేసింది. ఇప్పుడు వెంకటేష్‌ సరసన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. 

read  more: వెంకటేష్‌ `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ రివ్యూ

also read: `గేమ్‌ ఛేంజర్‌` రిజల్ట్ పై ఫస్ట్ టైమ్‌ రామ్‌ చరణ్‌ స్పందన.. పోస్ట్ వైరల్‌, ఏమన్నాడంటే?

Latest Videos

click me!