రామ్ చరణ్ హీరోగా నటించిన `గేమ్ ఛేంజర్` మూవీ సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనతో రన్ అవుతుంది. సంక్రాంతి పండగ కావడంతో బాగానే రన్ అవుతుందని తెలుస్తుంది. కలెక్షన్లు స్టడీగానే ఉంటున్నాయని అంటున్నారు. అయితే సినిమా రేంజ్‌తో పోల్చితే తక్కువనే చెప్పాలి.
సినిమాపై దారుణంగా నెగటివిటీ స్ప్రెడ్ అయ్యింది. ఇతర హీరోల అభిమానులు సినిమాని ట్రోల్ చేస్తున్నారు. వీరిలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హెచ్ డీ ప్రింట్‌ని కూడా లీక్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సినిమాని డ్యామేజ్ చేసేందుకు కుట్ర చేసినట్టు టీమ్ వెల్లడించింది.
వారిపై సైబర్ క్రైమ్‌కి కూడా ఫిర్యాదు చేసింది. నిజంగానే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉన్నారా? లేక ఫ్యాన్స్ ముసుగులో ఎవరైనా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఓ పెద్ద సినిమా రిలీజ్ సందర్భంగా ఇలాంటివి ఇటీవల కామన్ అవుతున్నాయి. సినిమా నిర్మాతలకు పెద్ద దెబ్బగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా ఫలితంపై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఆయన సోషల్ మీడియాలో అభిమానులకు, మీడియాకి, ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెబుతూ నోట్ విడుదల చేశారు.
ఈ సంక్రాంతికి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని, `గేమ్ ఛేంజర్` సినిమా కోసం మేం పడ్డ కష్టం కనిపిస్తుందని, ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా చిత్ర బృందానికి, నటీనటులు, టెక్నీషియన్లకి, ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన వారికి ధన్యవాదాలు అని తెలిపారు చరణ్.
మీరు చూపించి అమితమైన ప్రేమ, అభిమానం, సహకారం నాకు చాలా ఎక్కువ. ఈ సందర్భంగా మీడియాకి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ రివ్యూల ద్వారా ఎంకరేజ్‌మెంట్ అందించిన తీరు బాగుంది. సినిమా విజయంలో భాగమయ్యింది. ఈ ఏడాది ఇంతటి పాజిటివిటీతో స్వాగతం పలకడం హ్యాపీగా ఉంది.
ఈ సందర్భంగా మీకు(అభిమానులకు) ప్రామిస్ చేస్తున్నా, నేను నటనతో మిమ్మల్ని గర్వించేలా చేస్తానని. `గేమ్ ఛేంజర్` మూవీకి నా హృదయంలో ఎప్పటికీ మంచి స్థానం ఉంటుంది. మీ అమితమైన ప్రేమకి మరోసారి ధన్యవాదాలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు` అని తెలిపారు. ఈ సందర్భంగా ఈ మూవీని అందించిన దర్శకుడు శంకర్‌కి చరణ్ ధన్యవాదాలు తెలిపారు.