ఇలాంటి లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది నటులు ఆల్కహాల్ కి అలవాటు పడతారు. ఇండస్ట్రీ లో చాలా మంది నటులకు, సాంకేతిక నిపుణులకు ఈ మద్యం అలవాటు ఉంది. అయితే తీవ్రతలో తేడా ఉంటుంది. అకేషనల్ గా తాగే వారు కొందరు. రోజూ తాగేవాళ్ళు కొందరైతే, ప్రతిపూట తాగే వాళ్ళు కూడా ఉన్నారు. అలనాటి నటులు ఎస్వీ రంగారావు, హరనాథ్ తాగి సెట్స్ కి వచ్చేవాళ్లట. ఈ రోజుల్లో కూడా అలాంటి నటులు ఉన్నారు.