ఫస్ట్ నైట్ రోజు పూర్ణ కు సర్ ప్రైజ్..మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన షానిద్, భర్త ప్రేమకు ఫిదా అయిపోయిన హీరోయిన్

First Published | Nov 11, 2022, 9:14 AM IST

హీరోయిన్ పూర్ణ గురించి పెద్దగా పరిచయంచేయక్కర్లేదు. టాలీవుడ్  లో గ్లమర్ హీరోయిన్ గా అందరికి సుపరిచితురాలే.. ఇక రీసెంట్ గా సైలెంట్ మ్యారేజ్ చేసుకున్న పూర్ణా ఫిదా అయ్యేలా..  ఆమె భర్త ఫస్ట్ నైట్ కానుక ఇచ్చాడట. ఇంతకీ ఏమిచ్చి ఉంటాడు..?

పూర్ణ టాలీవుడ్ జనాలకు తెలిసిన పేరు. మంచి ఫిజిక్.. గ్లామర్ తో పాటు.. నటనలో కూడా తన మార్క్ చూపించుకోగలదు. కాని ఆమెకు స్టార్ల సరసన అవకాశాలు మాత్రం రాలేదు. అల్లరి నరేష్ సీమటపాకాయ్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ సోయగం.. ఆతరువాత వరుస ఆఫర్లు అందుకుంది. 

రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అవును సిరీస్ మూవీస్ తో బాగా పాపులర్ అయ్యింది పూర్ణ. కాని పెద్దహీరోలతో సినిమాలు చేయలేక పోయింది. అయినా టాలీవుడ్ లో తనకంటూఓ స్పెషల్ ఇమేజ్ మాత్రం సాధించింది. ఇక సినిమాలు తగ్గుతున్న సమయంలో ఢీ షోలో జడ్జిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది బ్యూటీ. 


ఢీ డాన్స్ షోలో జడ్జిగా ఆడియన్స్ కు మరింత చేరువైన బ్యూటీ.. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ.. జాలీగా గడిపేసిన పూర్ణ.. సడెన్ గా పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చింది. హై సెక్యూరిటీ మధ్య.. దుబాయ్ బిజినెస్ మెన్ తో జత కట్టింది మాలీవుడ్ చిన్నది. త్వరలో కేరళలో రిసెప్షెన్ కు ప్లాన్ చేస్తుందట. ఇక ఈ క్రమంలోనే పూర్ణాకు సబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 

poorna married

పూర్ణకు తన  భర్త షానిద్ కపూర్ మర్చిపోలేని మెమోరబుల్ గిఫ్ట్ ఇచ్చాడట. అది కూడా వాళ్ల ఫస్ట్ నైట్ రోజు ఇచ్చాడట. తమ జీవితంలో ఆరోజు గుర్తుండిపోయేలా తన భర్త ప్లాన్ చేయడంతో ఫిదా అయిపోయిందట పూర్ణ. దాంతో పూర్ణకు తన భర్త ఇచ్చిన ఫస్ట్ నైట్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. 

poorna married

సమాచారం ప్రకారం పూర్ణకు  కాస్ట్లీ రేర్  డైమండ్ రింగును గిఫ్ట్ గా ఇచ్చాడట షానిద్. తమ ఫస్ట్ నైట్ న ఆమె కు పెట్టారట . అంతేకాదు ఆ రింగ్ నార్మల్గా చూస్తే పూర్ణ పేరు  ఉండేలా.. రివర్స్ లో చూస్తే.. షానిద్ పేరు కనిపించేలా డిజైన్ చేశారట. ఈ గిప్ట్ తో ఉబ్బి తబ్బిబుఅయ్యిందట పూర్ణ. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. 

poorna married

ఇప్పటికే పెళ్లి కోసం పూర్ణకు కు చాలా హెల్ప్ చేశాడు షానిద్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు కోట్లల్లో ఎదురు కట్నం ఇచ్చి మరి పూర్ణాన్ని పెళ్లి చేసుకున్నారట షానిద్. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో కాని.. సోషల్ మీడియాలోమాత్రం తెగ వైరల్ అవుతోంది న్యూస్. 

Latest Videos

click me!