Karthika Deepam: హైటెన్షన్ సీన్.. మోనితకు చుక్కలు చూపించిన ఆనంద్ రావు, కార్తీక్?

Published : Nov 11, 2022, 07:36 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
15
Karthika Deepam: హైటెన్షన్ సీన్.. మోనితకు చుక్కలు చూపించిన ఆనంద్ రావు, కార్తీక్?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో మోనిత కార్తీక్ కు గతం గుర్తొచ్చినట్టా రానట్టా అంటూ ఆలోచించుకుంటూ వస్తుంది. ఇక బోటిక్ లో ఆనంద్ రావు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకు ఇక్కడకు వచ్చారని అడుగుతుంది.  ఎందుకు మౌనిత నన్ను చూసి ఇంతగా టెన్షన్ పడుతున్నావ్.. నేను ఇక్కడికి రాకపోతే నీకు కార్తీక్ గుర్తుకు రాడా చెప్పు.. ఇప్పటికైనా కార్తీక్ ని వదిలేసావు అని సంతోషిస్తాం అని ఆనందరావు అంటాడు. అంకుల్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటే ఆనంద్ రావును నీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోవాలి అనుకుంటున్నాం.. లోపల హిమ బాబుతో ఆడుకుంటుంది లోపలికి రా మాట్లాడాలి అని ఆనంద్ రావు అంటాడు.
 

25

లోపలికి వచ్చిన మోనిత ఎక్కడ కార్తీక్ ఇంటికి వస్తాడో అని టెన్షన్ పడుతుంటుంది. ఒకవైపు ఆనంద్ బాబును తీసుకెళ్తామని అడిగితే కుదరదు అంటుంది. కొన్నిరోజులు బాబుని మాతో పంపించు హిమా చాలా ఫీలవుతోందిని ఆనందరావు అంటాడు. ఇప్పుడు బాబును పంపించాలా వద్దా పంపిస్తే బాబు ఎక్కడ అని చెప్పి కార్తీక్ అడుగుతాడు పంపించకపోతే వీళ్ళు ఇప్పుడే కదిలేలా లేరు.. ఏం చేయాలి అని మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ ఎప్పుడైనా వచ్చేలా ఉన్నాడు వీళ్ళని త్వరగా పంపించాలి అని చెప్పి బట్టలు చేద్దామని అక్కడున్న పనిమనిషికి చెప్తుంది.
 

35

 ఆ తర్వాత టెన్షన్ గా ఇంటి నుంచి బయటికి వచ్చి ఇప్పుడు వంటలక్క డాక్టర్ బాబు దుర్గా అంకుల్ ని ఎవరు చేసినా ప్రాబ్లమే అంటూ వంటలక్క ఇంటికెళ్లి డాక్టర్ బాబా, దుర్గా ఎక్కడ అని అడుగుతుంది. నీకు డాక్టర్ బాబు కావాలా దుర్గ కావాలా చెప్పు దుర్గా కావాలంటే నేను ఇక్కడి నుంచి నా డాక్టర్ బాబును తీసుకొని వెళ్ళిపోతా అంటూ వంటలక్క సెటైర్ వేస్తుంది. ఏయ్ విసిగించకు డాక్టర్ బాబు ఎక్కడున్నాడో చెప్పు అంటే ఇంట్లో ఎక్కడైన దక్కున్నాడు ఏమో చూడు అంటే మళ్లీ బయటకు వస్తుంది.. అక్కడ డాక్టర్ బాబు ఇంటికి వెళుతుండగా ఫోన్ చేసి ఆగు కార్తీక్ ఆగు లోపలికి వెళ్ళదు శివకు యాక్సిడెంట్ అయ్యింది అంటూ అక్కడ నుంచి తీసుకెళ్తుంది.
 

45

అప్పుడే శివ కారు దగ్గరకు వస్తాడు.. నీకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు నువ్వు బాగున్నావ్ అని కార్తీక్ అంటాడు.. మోనితకు ఏం చెయ్యాలో తెలియక వణికిపోతుంది. ఎవరో ఫోన్ చేశారన్నవ్ కదా ఏది ఫోన్ చూపించు అని అంటే ఏం నామీద నమ్మకం లేదా అంటే నువ్వు చెప్పేవి అన్నీ అబద్దాలు నిన్ను ఎలా నమ్మాలి అంటూ తిడుడుతాడు. అసలు ఇక్కడ నుంచి ఎందుకు పంపించాలనుకుంటున్నావ్ నీ ప్లాన్ ఏంటి ఇంట్లో ఎవరు ఉన్నారు అంటూ కార్తీక్ ఇంట్లోకి వెళ్లాలనుకుంటాడు.. అప్పటివరకు ఇంట్లో ఉన్న ఆనంద్ రావు కార్తీక్ ఇంట్లోకి రాగానే వాళ్ళు ఉండరు. అప్పటికే అక్కడ ఉన్న పనమ్మాయి వాళ్ళిద్దర్నీ పంపించేసి ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరు కదా మోనిత అంటే నేను అదే చెప్పేది ఇంట్లో ఎవరూ లేరని అని డాబాయిస్తుంది.
 

 

55

మరో సీన్ లో ఇంతకీ ఆనంద్ ఎక్కడున్నాడు అంటూ కార్తీక్ అడిగితే.. ఇప్పుడు వాడి గురించి ఎందుకు? మళ్లీ నన్ను ఏదో ఒక రకంగా అనుమానించాలా అంటూ మోనిత సీరియస్ అవుతుంది. నీతో అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోతాడు. ఇక అప్పుడే శివ వస్తే చెంప పగలగొడుతుంది. ఎందుకొచ్చావ్ రా ఒక అర్థగంట ఆగి రావాల్సింది అంటూ సీరియస్ అవుతుంది. ఆతర్వాత ఎంత పెద్ద గండం తప్పింది.. సమయానికి శివలత వాళ్లిద్దరిని పంపించి మంచి పని చేసింది.. అంటూ పని అమ్మాయిని పొగుడుతుంది. శివలతకి నిజం అంత తేలిపోయిందంటూ ఈ విషయం ఎక్కడ చెప్పద్దు అంటూ ఆమెకు చెబుతుంది. మేము ఇద్దరమే కలిసి ప్రశాంతంగా ఉండాలే ప్లాన్ చెయ్యాలి అని మోనిత అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

click me!

Recommended Stories