ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవాయని, గౌతమ్ రిషీ వసుధార కోసం వెయిట్ చేస్తుంటారు. రిషీ ఇష్టపడ్డాడు కాబట్టి వసుధారని ఇంటికి రానిస్తుంది అని గౌతమ్ మనసులో అనుకుంటాడు. అప్పుడే రిషి వసు ఇద్దరు కలిసి వస్తారు.. అయితే వసుధార రిషి కోట్ వేసుకొని రావడంతో అదేంటి వసుధార ఇలా వచ్చింది అని దేవయాని అంటుంది.. చెప్తాను పెద్దమ్మ అంటూ వస్తారా నువ్వు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటాడు.. ఏమైంది నాన్న ఎక్కడికి వెళ్లావు ఏంటి ఇదంతా అంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను పెద్దమ్మ అని చెప్తాడు. ఏంటో ఎక్కడికెళ్లాడు ఏం చేశారో అంటూ దేవయాని ఫీల్ అయిపోతుంది.