1 రూపాయి భోజనం, రూ.350 జీతంతో కష్టాలు అనుభవించిన తండ్రి.. కొడుకు ఇప్పుడు 800 కోట్లు వసూళ్లు రాబట్టే హీరో

Published : Jul 28, 2025, 11:31 AM IST

బాలీవుడ్ లో ప్రముఖ స్టంట్ డైరెక్టర్ అయిన శామ్ కౌశల్ ఒక్క రూపాయి భోజనంతో జీవితం గడుపుతూ ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన కొడుకు ప్రస్తుతం బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు రాబట్టగలిగే అగ్ర హీరోల జాబితాలో చేరారు. 

PREV
15
శామ్ కౌశల్ కన్నీటి కష్టాలు

చిత్ర పరిశ్రమలో కన్నీటి కష్టాలకు కొదవలేదు. కాలం కలిసి వస్తే అట్టడుగు స్థాయి వ్యక్తులు కూడా స్టార్లు అయిపోతారు. ఆ విధంగా కిందిస్థాయి నుంచి ఎదిగిన స్టార్లు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ లో శామ్ కౌశల్ జీవితం అలాంటిదే. శామ్ కౌశల్ బాలీవుడ్ లో ప్రముఖ యాక్షన్ స్టంట్ డైరెక్టర్ గా రాణించారు. అయితే అంతకు ముందు ఆయన జీవితం సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలు అనుభవించారు.

ఆ తర్వాత శామ్ కౌశల్ బాలీవుడ్ లో గుర్తింపు పొందడమే కాదు.. ఆయన కొడుకు కూడా బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించాడు. శామ్ కౌశల్ కొడుకు మరెవరో కాదు విక్కీ కౌశల్. 1978లో శామ్ కౌశల్ తన కెరీర్ ప్రారంభించారు. తన తండ్రి దగ్గర రూ.300 తీసుకుని పంజాబ్ నుంచి ముంబై వచ్చారు. లిటరేచర్ లో ఆయన ఎంఏ పూర్తి చేశారు. లెక్చరర్ కావాలనేది ఆయన లక్ష్యం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల తన లక్ష్యాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది.

DID YOU KNOW ?
ఛావా మూవీ బడ్జెట్, వసూళ్లు
విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఛావా చిత్రం 130 కోట్ల బడ్జెట్ లో రూపొందింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 800 కోట్లు రాబట్టి సంచలన విజయంగా నిలిచింది.
25
ఒక్క రూపాయి భోజనం, జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన

ముంబైలో సేల్స్ మెన్ గా 350 జీతానికి ఉద్యోగంలో చేరారు. రోజూ 2 బస్సులు, ఒక రైలు మారి ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చేది. కొంతకాలం అద్దె కట్టలేక ఆఫీస్ లోనే పడుకునేవారట. ప్రతి రోజూ ఒక్క రూపాయితో చాలా చవకైన భోజనం మాత్రమే చేసేవారు. ఉద్యోగం చేస్తున్నంత కాలం 3 షర్ట్స్, 2 ప్యాంట్స్ మాత్రమే ధరించడానికి ఉండేవట. ఏడాది తర్వాత శామ్ కౌశల్ ఉద్యోగం పోయింది. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన అని చెప్పొచ్చు.

బాలీవుడ్ లో శామ్ కౌశల్ స్నేహితులు స్టంట్ మెన్ లుగా పనిచేసేవారు. వారి సహాయంతో శామ్ కౌశల్ కూడా స్టంట్ మెంట్ అసోసియేట్ గా జాయిన్ అయ్యారు. సభ్యత్వానికి అవసరమైన రూ 1000 కూడా స్నేహితులే సాయం చేశారు. అక్కడ కూడా చాలా కష్టపడ్డారు. ప్రారంభంలో టీలు ఇవ్వడం, బ్యాగులు మోయడం లాంటి పనులు చేశారు. ఆ తర్వాత స్టంట్ మెన్ గా క్రమంగా గుర్తింపు మొదలైంది.

35
స్టంట్ డైరెక్టర్ గా గుర్తింపు

పప్పు వర్మ దగ్గర స్టంట్ డైరెక్టర్ గా పనిచేసి తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు. 1983లో సన్నీడియోల్ బేతార్ చిత్రానికి పనిచేయడం ద్వారా రూ 500 పారితోషికం అందుకున్నారు. అప్పట్లో అది చాలా ఎక్కువ. ఆ తర్వాత గుర్తింపు రావడంతో బాలీవుడ్ లో ప్రముఖ స్టంట్ డైరెక్టర్ గా మారారు. అంతా బావుంది అనుకుంటున్న తరుణంలో శామ్ కౌశల్ జీవితంలో మరో కుదుపు ఏర్పడింది.

45
క్యాన్సర్ ని ఎదుర్కొని..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. లఢక్ లో లక్ష్య అనే మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కడుపులో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. దీనితో వైద్యులు ఆయనకి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో శామ్ కౌశల్ దేవుడిని ఒక్కటే కోరుకున్నారు. నా పిల్లలు ఇంకా చిన్న వారే. వారి జీవితం సెటిల్ చేయాలి. కాబట్టి మరో పదేళ్లు ఆయుష్షు ఇమ్మని దేవుడిని ప్రార్థించారట.

55
శామ్ కౌశల్ తనయుడు విక్కీ కౌశల్ బాలీవుడ్ లో తిరుగులేని హీరో

కానీ వైద్యులు ఆయనకి విజయవంతంగా సర్జరీ చేసి క్యాన్సర్ ని తొలగించారు. ఆరోగ్యం కుదుటపడింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్క రూపాయి భోజనంతో కష్టాలు అనుభవించిన దానికి ప్రతిఫలం శామ్ కౌశల్ కి తన కొడుకు రూపంలో దక్కింది. శామ్ కౌశల్ తనయుడు విక్కీ కౌశల్ ప్రస్తుతం బాలీవుడ్ లో తిరుగులేని హీరో. విక్కీ కౌశల్ చివరగా నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద 800 కోట్లు రాబట్టింది. అంటే శామ్ కౌశల్ కుటుంబం 1 రూపాయి భోజనం, 350 జీతం నుంచి 800 కోట్లు రాబట్టగలిగే స్థాయికి ఎదిగింది. అసలైన సక్సెస్ అంటే ఇదే అని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీ కౌశల్ 2021లో బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ ని వివాహం చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories