అడ్డా ఎక్స్‌ట్రీమ్ బ్యాటిల్ (Adda Extreme Battle)
ఎల్విష్ యాదవ్ హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొని సందడి చేయనున్నారు. వివిధ గేమ్స్, టాస్క్ లతో ఈ షో ఉత్కంఠభరితంగా ఉంటుంది.
రిలీజ్ తేదీ: జూలై 28
బ్లాక్ బ్యాగ్ (Black Bag)
స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ చిత్రం ఇది. దేశ ద్రోహం కేసులో అనుమానితురాలైన భార్యపై నమ్మకమా? లేక దేశ భద్రతపై విధేయతా? అనే రెండు అంశాల మధ్య నలిగే జార్జ్ వుడ్‌హౌస్ కథగా ఈ చిత్రం రూపొందింది. మైఖేల్ ఫాస్‌బెండర్, కేట్ బ్లాంచెట్, నావోమీ హ్యారిస్ ప్రధాన పాత్రల్లో నటించారు. రిలీజ్ తేదీ: జూలై 28
క్యూకీ సాస్ భీ కభీ బహు థీ సీజన్ 2 (Kyunki Saas Bhi Kabhi Bahu Thi Season 2)
రాజకీయ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ తులసి విరాణీగా ఈ సీజన్‌లో కనపించనున్నారు. ఆధునిక తరం పిల్లలతో బంధాలు ఎలా ఎదుర్కొనాలో తులసి ఎలా నేర్పుతుందనేది ఈ సిరీస్ కథ.
రిలీజ్ తేదీ: జూలై 29
పతి పత్నీ ఔర్ పంగా (Pati Patni Aur Panga)
జంటలు ఒకరికొకరు వినోదభరితమైన సవాళ్లు విసురుతూ తమ బంధాన్ని పరీక్షించుకునే ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ఇది.
రిలీజ్ తేదీ: ఆగస్టు 2