Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని

Published : Sep 09, 2026, 11:04 PM IST

బిగ్ బాస్ తెలుగు 10 లో భాగంగా బుధవారం రోజు రోహిత్, త్రిగుణ్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తోంది. వీరిద్దరూ చీటికీ మాటికీ వాగ్వాదానికి దిగుతున్నారు.

PREV
15
Bigg Boss Telugu 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో తొలి వారంలోనే ఇంటి సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ మొదలైంది. ఇంటి సభ్యులు ప్రస్తుతం బ్లూ టీమ్, రెడ్ టీమ్ గా ఉన్నారు. బుధవారం సెప్టెంబర్ 9న ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామ్ ప్రసాద్ టీం లీడర్ గా ఛాన్స్ కోల్పోయాడు. దీనితో అతడు కొత్త టీం లీడ్ గా దేబ్జానీ పేరు ప్రస్తావించారు. దీనికి బ్లూ టీం సభ్యులు అంగీకారం తెలిపారు.

25
రామ్ ప్రసాద్, చరణ్ కి షాక్

ప్రస్తుతానికి రామ్ ప్రసాద్, ఆర్జే చరణ్ ఏ టీంకి సంబంధించిన సభ్యులు కారు. రెండు టీమ్స్ లలో ఒక టీమ్ వర్కింగ్ టీమ్ గా మరొక టీం మోనిటరింగ్ టీమ్ గా ఉండాలి అని బిగ్ బాస్ సూచించారు. దీనితో బ్లూ టీం లీడర్ గా దేబ్జానీ తాము మోనిటరింగ్ చేస్తామని ప్రకటించింది. మరో వైపు రెడ్ టీం వర్కింగ్ టీంగా బాధ్యతలు తీసుకున్నారు.

35
రెచ్చగొట్టిన రోహిత్

అయితే రెడ్ టీం టీమ్ లీడర్ రోహిత్ మాట్లాడిన విధానం బ్లూ టీంని రెచ్చగొట్టేలా ఉంది. దీనితో త్రిగుణ్ అతడితో గొడవకు దిగాడు. కిచెన్ వర్క్ బాగా చేసేవాళ్ళు మా సైడ్ ఎక్కువ మంది ఉన్నారు. బ్లూ టీంలో జీరో అని రోహిత్ మాట్లాడడం.. బ్లూ టీంకి కోపం తెప్పించింది. దీనితో త్రిగుణ్, రోహిత్ మధ్య గొడవ ఎక్కువైంది. ఒకరి మీదకు ఒకరు వెళ్లారు.

45
నేను వాడిని కెలుకుతా

తర్వాత తన మాటలకు రోహిత్ క్షమాపణ చెప్పాడు. బ్లూ టీం సభ్యులు మానిటరింగ్ ఎలా చేయాలో స్ట్రాటజీలో భాగంగా చర్చించుకున్నారు. రెడ్ టీం వాళ్ళు, ముఖ్యంగా రోహిత్.. త్రిగుణ్ ని రెచ్చగొడతారు అని వర్షిణి చెప్పింది. త్రిగుణ్ బదులిస్తూ నేనేం తక్కువ వాడిని కాదు.. నేను కూడా వాడిని కచ్చితంగా కెలుకుతా అని త్రిగుణ్ బదులిచ్చాడు.

55
వర్షిణిని ఇరికించిన షాలిని

ఈ మధ్యలో రెడ్ టీం లో ఉన్న షాలినికి వాష్ రూమ్ క్లీనింగ్ పని అప్పగించారు. షాలిని తనకు ఉన్న పవర్ ఇక్కడ వాడుకుంది. ఆ పవర్ ద్వారా వాష్ రూమ్ క్లీనింగ్ పనిని వర్షిణికి ఇచ్చింది. హౌస్ లో ఉన్నంత కాలం వర్షిణి వాష్ రూమ్ క్లీనింగ్ చేయాల్సిందే. మొత్తంగా షాలిని తన పవర్ తో వర్షిణిని ఇరికించింది.

Read more Photos on
click me!

Recommended Stories