బిగ్ బాస్ తెలుగు 7లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న షకీలా, మరో బోల్డ్ బ్యూటీ కూడా.. హౌస్ మొత్తం షేక్ అయిపోదా..

Published : Aug 27, 2023, 05:10 PM IST

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫెరెంట్ గా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

PREV
16
బిగ్ బాస్ తెలుగు 7లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న షకీలా, మరో బోల్డ్ బ్యూటీ కూడా.. హౌస్ మొత్తం షేక్ అయిపోదా..

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫెరెంట్ గా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్స్ లో కూడా నాగార్జున ఉల్టా పల్టా అంటూ సందడి చేస్తున్నారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ రూల్స్ మొత్తం మార్చేసి ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చే వినోదం రెడీ చేస్తున్నారట. 

26

దీని కోసం కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఆ తరహాలోనే సాగినట్లు తెలుస్తోంది. ఆడియన్స్ లో పాపులారిటీ కలిగిన సెలెబ్రిటీలనే సీజన్ 7 కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ గురించి క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు 7లో శృంగార తార ఒకప్పటి మలయాళీ ఇండస్ట్రీ క్వీన్ షకీలా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

36

షకీలా గురించి ఎవ్వరికి పరిచయం అవసరం లేదు. 90 దశకంలో ఆమె మలయాళంలో శృంగార చిత్రాలతో ఒక ఊపు ఊపింది. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. అలాంటి బోల్డ్ బ్యూటీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే షేక్ కావడం ఖాయం అంటున్నారు. 

46

అదే విధంగా మరో బోల్డ్ బ్యూటీ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు కిరణ్ రాథోడ్. నువ్వులేక నేను లేను, జెమినీ, కెవ్వు కేక, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాంటి చిత్రాల్లో కిరణ్ రాథోడ్ గ్లామర్ పాత్రలు చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఒలకబోస్తూ యాక్టివ్ గా ఉంటోంది. 

56

సీజన్ 7కి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా కొనసాగనున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ వివరాలు కూడా త్వరలో బయటకి రానున్నాయి. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ లిస్ట్ ని గోప్యంగా ఉంచి లాంచ్ రోజునే సర్ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

66

ఏది ఏమైనా షకీలా లాంటి కాంట్రవర్షియల్ నటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే టిఆర్పి రేటింగ్స్ కి ఢోకా ఉండదని నెటిజన్లు అంటున్నారు. గత సీజన్లు దారుణంగా నిరాశపరిచాయి. దీనితో బిగ్ బాస్ షోకి తిరిగి పాపులారిటీ పెంచేందుకు నిర్వాహకులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. 

click me!

Recommended Stories