కవల పిల్లలతో కలసి నయనతార, విగ్నేష్ ఓనం సంబరాలు.. ఉయిర్, ఉలగన్ పంచె కట్టులో భలే ఉన్నారే.. వైరల్ పిక్స్

Published : Aug 27, 2023, 03:58 PM IST

నయనతార, విగ్నేష్ శివన్ తమ కవల పిల్లలతో కలసి ఓనం సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలు పుట్టాక నయన్, విగ్నేష్ తొలిసారి సెలెబ్రేట్ చేసుకున్న ఓనం ఇది.

PREV
16
కవల పిల్లలతో కలసి నయనతార, విగ్నేష్ ఓనం సంబరాలు.. ఉయిర్, ఉలగన్ పంచె కట్టులో భలే ఉన్నారే.. వైరల్ పిక్స్

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత  ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. 

26

నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది.చాలా కాలం పాటు సహజీవనం చేసిన నయన్, విగ్నేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. 

36

నయనతార, విగ్నేష్ శివన్ జోడి ఎక్కడ కనిపించినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున జనసంద్రంలా మారడం చూస్తూనే ఉన్నాం. నయనతార సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ మాత్రమే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

46

తాజాగా నయనతార, విగ్నేష్ శివన్ తమ కవల పిల్లలతో కలసి ఓనం సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలు పుట్టాక నయన్, విగ్నేష్ తొలిసారి సెలెబ్రేట్ చేసుకున్న ఓనం ఇది. దీనితో ఈ దృశ్యాలని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉయిర్, ఉలగన్ లతో ఇది తొలి ఓనం. అందరికి ఓనం శుభాకాంక్షలు అంటూ విగ్నేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

56

ఈ పిక్స్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అయితే విగ్నేష్, నయన్ తమ పిల్లల ముఖాలన్ని మాత్రం చూపించడం లేదు. వెనుక నుంచి మాత్రమే చూపిస్తున్నారు. ఈ ఫొటోస్ లో ఉయిర్, ఉలగన్ ఇద్దరూ పంచె కట్టులో కనిపిస్తున్నారు. ముద్దొస్తున్న ఇద్దరూ అరిటాకుల్లో భోజనం చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

66

ఇదిలా ఉండగా నయనతార భర్తతో రొమాంటిక్ గా వైట్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు కూడా నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటిఫుల్ పిక్స్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories