Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా

Published : Mar 05, 2026, 07:48 PM IST

Shakeela: నటి షకీలా, దివంగత కమెడియన్ వేణు మాధవ్ మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక షూటింగ్ సమయంలో హోటల్ రూమ్ ఇబ్బందిగా ఉండటంతో వేణు మాధవ్ గదిలో పడుకున్న షకీలాకు.. 

PREV
15
కెరీర్‌లో ఎదురైన..

దక్షిణాది సినీ రంగంలో బోల్డ్ పాత్రలతో గుర్తింపు పొందిన నటి షకీలా, తన కెరీర్‌లో ఎదురైన అనేక ఆసక్తికర సంఘటనలను తరచుగా పంచుకుంటూ ఉంటారు. తాజాగా దివంగత హాస్య నటుడు వేణు మాధవ్‌తో తనకు ఉన్న అనుబంధం, ఒక షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు.

25
రూమ్ సమస్య - వేణు మాధవ్ సాయం

ఒక సినిమా షూటింగ్ కోసం షకీలా, వేణు మాధవ్, బ్రహ్మానందం, రఘుబాబు అందరూ ఒకే హోటల్‌లో బస చేశారు. అయితే మిగిలిన నటులందరూ షకీలా రూమ్‌లోనే భోజనం చేయడంతో ఆ గది మొత్తం అపరిశుభ్రంగా మారిందట. పడుకోవడానికి వీలు లేకపోవడంతో, షకీలా తన స్నేహితుడైన వేణు మాధవ్‌ను అడిగి ఆయన గదికి వెళ్లిందట. వేణు మాధవ్ కూడా ఏమాత్రం సంకోచించకుండా ఆమెను రమ్మని ఆహ్వానించాడు.

35
రాత్రి అనుమానం

గదిలో లైట్లు ఆపేసి ఉన్న సమయంలో వేణు మాధవ్ షకీలాతో మాట్లాడుతూ.. "నేను నిన్ను ఒక మాట అడుగుతాను, నువ్వు కాదనకూడదు" అని అన్నాడట. ఆ మాట విన్న షకీలాకు ఒక్కసారిగా అనుమానం కలిగింది. "మంచి స్నేహితుడు అనుకుంటే వేణు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి? ఏమైనా బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడా?" అని ఆమె భయపడిందట. ఒకవేళ ఏమైనా తప్పుగా అడిగితే స్నేహం కట్ చేద్దామని కూడా నిశ్చయించుకుంది.

45
ట్విస్ట్ అదిరింది

షకీలా ఏంటో అడుగు అని చెప్పగా, వేణు మాధవ్ చాలా సీరియస్ గా.. "నాకు పెళ్లాం పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగుండాలంటే నేను బతికి ఉండాలి" అని చెప్పాడట. అసలు విషయం ఏంటని అడిగితే.. "నిద్రలో నువ్వు పొరపాటున నాపై కాలు వేస్తే నేను చచ్చిపోతాను, అందుకే మన ఇద్దరి మధ్యలో ఈ దిండ్లు పెడుతున్నాను, వీటిపై కాలు వేసుకో" అని చెప్పి పక్కన పిల్లోస్ అడ్డుగా పెట్టాడట.

55
రాత్రంతా నవ్వు ఆగలేదట

ఈ మాట విన్న షకీలాకు రాత్రంతా నవ్వు ఆగలేదట. మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని బ్రహ్మానందం, రఘుబాబుకు చెప్పడంతో సెట్ లో అందరూ నవ్వుకున్నారట. వేణు మాధవ్ లోని ఆ అమాయకత్వం, కామెడీ టైమింగ్ షకీలా ఇప్పటికీ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories