Chiranjeevi ప్లాప్ అనుకున్న సినిమాను పట్టుబట్టి చేశారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్

Published : Mar 05, 2026, 07:14 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 'పసివాడి ప్రాణం' ఒక మైలురాయి. అయితే ఈ సినిమా కథ మొదట రెబల్ స్టార్ కృష్ణంరాజు వద్దకు వెళ్లిందని, ఆయన షూటింగ్ కూడా ప్రారంభించారని మీకు తెలుసా? నిర్మాత నారాయణరావు పట్టుబట్టి ఈ సినిమాను.. 

PREV
15
బాక్సాఫీస్ వద్ద రికార్డులు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సెన్సేషన్ సృష్టించిన చిత్రాల్లో 'పసివాడి ప్రాణం' ఒకటి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడమే కాకుండా, టాలీవుడ్‌లో బ్రేక్ డ్యాన్స్ ట్రెండ్‌ను పరిచయం చేసింది. అయితే, ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొదట చిరంజీవిది కాదని, కృష్ణంరాజు చేయాల్సిన సినిమా అని నటుడు, నిర్మాత నారాయణరావు వెల్లడించారు.

25
రీమేక్ హక్కులు, చిరంజీవి సందేహం

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒక థ్రిల్లర్ సినిమా రీమేక్ హక్కులను నారాయణరావు కొనుగోలు చేశారు. ఈ సినిమాను చిరంజీవితో చేస్తే బాగుంటుందని ఆయనకు చూపించగా, చిరంజీవి మొదట వెనకడుగు వేశారు. ఒరిజినల్ సినిమాలో పాటలు లేకపోవడంతో, పాటలు లేని థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? అని ఆయన సందేహించారు. దీంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి చిరంజీవి మరో షూటింగ్ కోసం బొంబాయి వెళ్లిపోయారు.

35
కృష్ణంరాజు ఎంట్రీ - నారాయణరావు పట్టుదల

చిరంజీవి ఆసక్తి చూపకపోవడంతో, దర్శకుడు కోదండరామిరెడ్డి అదే కథతో కృష్ణంరాజు హీరోగా సినిమాను ప్రారంభించేశారు. ఈ విషయం తెలిసిన నారాయణరావు వెంటనే అల్లు అరవింద్‌కు ఫోన్ చేసి, రీమేక్ హక్కులు తన వద్ద ఉన్నాయని, ఈ సినిమా చిరంజీవి మాత్రమే చేయాలని పట్టుబట్టారు. అల్లు అరవింద్ కూడా మొదట సంకోచించినా, నారాయణరావు పట్టుదలతో చిరంజీవిని ఒప్పించి కృష్ణంరాజు సినిమాను ఆపించేశారు.

45
కమర్షియల్ మార్పులు, ఇండస్ట్రీ హిట్

మలయాళ వెర్షన్‌లో ఒక్క పాట కూడా లేదు. కానీ తెలుగులో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆరు పాటలను చేర్చారు. పసివాడి ప్రాణం సినిమాను పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మార్చడంతో అది బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరంజీవితో తనకున్న స్నేహం వల్లనే ఈ అద్భుతమైన సినిమా సాధ్యమైందని ఆయన గుర్తు చేసుకున్నారు.

55
చిరంజీవి కెరీర్‌లో..

ఒకవేళ నారాయణరావు పట్టుబట్టకపోతే, చిరంజీవి కెరీర్‌లో ఈ అద్భుతమైన హిట్ ఉండేది కాదు. అలాగే కృష్ణంరాజు ఖాతాలో మరో వైవిధ్యమైన సినిమా చేరేది. కానీ కాలం చిరంజీవిని ఆ పాత్రకు ఎంపిక చేసి చరిత్ర సృష్టించింది.

Read more Photos on
click me!

Recommended Stories