ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రాజెక్ట్ ని క్విట్ చేద్దాము అంటారు. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది జగతి. మిషన్ ఎడ్యుకేషన్ అనేది నా బ్రెయిన్ చైల్డ్ దానిని కంటిన్యూ చేయాలో క్విట్ చేయాలో నిర్ణయించే హక్కు నాకు రిషికి, వసుకి మాత్రమే ఉంది. వాళ్లు లేరు కాబట్టి ఈ ప్రాజెక్టుని నేను ముందుకు తీసుకు వెళ్తాను ఇష్టం లేని వాళ్ళు పక్కకు తప్పుకోవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని మీటింగ్ ముగించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి.