Guppedantha Manasu: భయంతో వణికిపోతున్న శైలేంద్ర.. అతి తెలివితో భర్తని ఆడుకుంటున్న ధరణి!

First Published | Nov 3, 2023, 9:10 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తల్లిని చంపిన వాళ్లని పట్టుకోవాలని తపన పడుతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో మీరు ఎంక్వయిరీ మన  అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించండి అంటుంది వసుధార. సాధారణంగా మేము ఎంక్వయిరీ అలాగే ప్రారంభిస్తాం, ముందుగా బంధువుల దగ్గర నుంచి తర్వాత చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వయిరీ చేస్తాము అనుమానం వచ్చిన వాళ్ళని అదుపులోకి తీసుకుంటాము అంటాడు  అతుల్. బయట అలా ఏమో గాని మా ఇంట్లో అలాంటి పరిస్థితి రాదు ఎందుకంటే మా ఇంట్లో అందరం చాలా ప్రాణంగా ఉంటాము అంటుంది దేవయాని.
 

 అలా ఎందుకు అనుకోవాలి ఏమో ఎవరికి తెలుసు మనకు తెలియకుండానే మనం వెనకాతల గోతులు తీసే వాళ్ళు ఉంటారు కదా అంటుంది వసుధార. అసలు జగతి మేడం ఫోన్ మాట్లాడటం ఎవరైనా విన్నారా, ఆవిడ ఇంట్లోంచి బయలుదేరడం బయటి వాళ్ళకి ఎవరో చేరవేశారు అయినా రిషి సార్ జగతి మేడం దగ్గరికి వెళ్తున్నట్లు మీకు ఎలా తెలుసు అని వసుధారని ఎంక్వయిరీ చేస్తాడు అతుల్.
 


ధరణి చెప్పింది అని తెలిస్తే ఇబ్బందుల్లో పడుతుందని నాకే ఎందుకో అనుమానం వచ్చింది. ఇంతకుముందు కూడా సార్ మీద అలాగే అటాక్స్ జరిగాయి ఆ అనుమానంతోనే వెళ్లాను అంటుంది వసుధార. అదేంటి ఇంతకుముందు కూడా ఎటాక్స్ జరిగాయా అని అడుగుతాడు అతుల్. అవును సార్, మా రిషి మీద చాలాసార్లు అటాక్స్ జరిగాయి కానీ అదృష్టం కొద్ది ఏమీ కాలేదు అంటాడు ఫణీంద్ర.
 

అసలు ఈ అటాక్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అయ్యాయి అంటాడు అతుల్. మా ఆయన వచ్చిన దగ్గరనుంచి అని భర్తని ఇరికించేస్తుంది ధరణి. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తనకి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు పెద్దగా పట్టించుకోకండి అంటాడు శైలేంద్ర. అమాయకురాలు కాబట్టే నిజం చెప్పింది అంటుంది వసుధార. అలా అంటావేంటి ధరణి.
 

తను వచ్చిన దగ్గరనుంచి ఈ సమస్యలలో తను కూడా పాలుపంచుకుంటున్నాడు కదా అంటుంది దేవయాని. నేను ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తాను, ఆల్రెడీ మేడం నెంబర్ ఆఫీస్ కి సెండ్ చేశాను అక్కడ నుంచి కాల్ డేటా వస్తుంది, ఆ తర్వాత మీరు మేడం కలవడానికి వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తాము ఈ ఎంక్వయిరీ ప్రాసెస్ లో మిమ్మల్ని ఏ నిమిషంలో అయినా అప్రోచ్ అవుతాను అప్పుడు కోపరేట్ చేయండి అంటాడు అతుల్.
 

అలా మాట్లాడుతుంటే అతని టాలెంట్ కి భయంతో వణికి పోతాడు శైలేంద్ర. తప్పకుండా చేస్తాను నేను పరువు కంటే ప్రాణం ముఖ్యం అనుకునేవాడిని, అందుకే జగతి ప్రాణం తీసిన వాడిని పట్టుకుని తీరాలి అంటాడు ఫణీంద్ర. సరే అని అక్కడ నుంచి అందరూ బయలుదేరుతారు.
 

తరువాత ఆలోచిస్తూ కూర్చున్న భర్త దగ్గరికి పూలు తీసుకొని వచ్చి కూర్చుంటుంది వసుధార. పూలు కడుతూ భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. అతుల్ సంగతి ముందే చెప్పలేదని నీకు కోపంగా ఉందా అంటాడు రిషి. అలాంటిదేమీ లేదు మీరు నాకు ఏం చెప్పకపోయినా కూడా పర్వాలేదు అంటుంది వసుధార.
 

ఆ తరువాత వాళ్ళిద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకుంటారు. మరోవైపు తను ఏమీ చేయలేకపోతున్నందుకు, ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నందుకు తనని తానే బెల్టుతో కొట్టుకుంటూ ఫ్రెష్టేట్ అవుతాడు శైలేంద్ర. అది చూసిన దేవయాని శైలేంద్రని ఆపుతుంది. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని లోపలికి వచ్చి కాఫీ తాగమంటుంది.
 

దేవయాని, శైలేంద్ర ఇద్దరూ కోప్పడతారు. అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడుగుతుంది దేవయాని. ఆయన ప్లాన్స్ సక్సెస్ అవ్వక  ఫ్రెస్టేట్  అవుతున్నారు. అందుకే తలనొప్పి తగ్గుతుందని కాఫీ తీసుకు వచ్చాను. అయినా తగ్గకపోతే చెప్పండి టాబ్లెట్ తీసుకు వస్తాను అని అమాయకత్వంతో కూడిన అతి తెలివితో భర్తని ఆడుకుంటుంది ధరణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Latest Videos

click me!