రెండేళ్ల కింద ఓటీటీలో విడుదలై ఆడియెన్స్ ను థ్రిల్ చేసిన మూవీ ‘మా ఊరి పొలిమేర’. ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపుదిద్దుకున్న సినిమానే Maa Oori Polimera 2. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేశ్, బాలాదిత్య, గేటప్ శ్రీను, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించారు.
ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘పొలిమేర 1’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు ‘పొలిమేర2’ గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఓటీటీలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. సెకండ్ భాగాన్ని పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నారంటేనే ఈ చిత్రం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
అయితే, ఈరోజు ‘మా ఊరి పొలిమేర 2’ గ్రాండ్ గా థియేటర్ లోకి రాబోతోంది. ఇప్పటికే యూఎస్ఏలో ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి పార్ట్ కు ధీటుగా రెండో పార్ట్ ను తెరకెక్కించారని తెలుపుతున్నారు. ఇటీవలి కాలంలో అత్యుత్తమ కథనాన్ని అందించిందన్నాను. ఎక్కువ శాతం స్క్రీన్ ప్లై సూపర్ అంటున్నారు. మొదటి భాగంలో కంటే సెకండ్ పార్ట్ కోసమే అన్ని వివరాలను దాచిపెట్టి అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించారని ఫీల్ అవుతున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం బాగుందంటు మార్కులు వేస్తున్నారు.
పార్ట్ 1 మరియు పార్ట్ 2ను లింకప్ చేసే సన్నివేశాలు మెప్పించాయంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్సలెంట్ బీజీఎంతో క్షణక్షణం ఉత్కంఠగా సీన్లు సాగిపోతాయని చెబుతున్నారు. ఎక్కడా బోరింగ్ సీన్స్ లేవంట. థ్రిల్లింగ్, ట్విస్టులు నెక్ట్స్ లెవల్లో ఉన్నాయంటున్నారు. Gyaani అందించిన బీజీఎం సినిమాకు ప్రాణం పోసిందని తెలుపుతున్నారు.
ఇక సత్యం రాజేశ్, గేటప్ శ్రీను, కామక్షి భాస్కర్ల సినిమాను తమ పెర్ఫామెన్స్ తో ముందుకు తీసుకెళ్లారని చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్టులు, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను మరింతగా థ్రిల్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ట్విస్టులతోనే అలరిస్తారంట. మంచి ట్విస్ట్ తో క్లైమాక్స్ ను చూపించారని తెలుపుతున్నారు. ఈ చిత్రానికి పార్ట్ 2 వరకే కాదు.. పార్ట్ 3 కూడా తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం నిడివి రెండుగంటల 10 నిమిషాలు. ఎలాంటి కట్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ హారర్ర్ థ్రిల్లర్ కు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేశ్, కామాక్షిభాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను, రవి వర్మ, రాకెండు మౌళి, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. జ్యాని, కుశేందర్ రమేశ్ రెడ్డి మంచి సినిమాటోగ్రఫీని అందించారు. శ్రీ క్రిష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌర్ క్రిష్ణ నిర్మించారు. ఈరోజు (నవంబర్ 3)నప్రేక్షకుల ముందుకు వచ్చింది.