Published : Mar 05, 2024, 07:11 AM ISTUpdated : Mar 05, 2024, 08:34 AM IST
దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ కి ఆహ్వానం దక్కింది. అయితే ఈ వేడుకలో రామ్ చరణ్ కి అవమానం జరిగిందట
కోటీశ్వరుడు తలచుకుంటే కొండ మీద కోతి అయినా దిగివస్తుంది అంటారు. లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కి లోకమే తరలి వచ్చింది. హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కొందరికి కోట్లు కుమ్మరించి పిలిపించారని సమాచారం.
26
Anant Ambani Radhika Merchant Pre Wedding
కాగా హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు. ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ వేడుకకు హాజరయ్యారు. వేదిక మీద డాన్సులు చేశారు.
36
Anant Ambani Radhika Merchant Pre Wedding
కాగా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కి ఆహ్వానం దక్కింది. ఆయన సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నాడు. కాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రామ్ చరణ్ కి అవమానం జరిగిందట. షారుక్ ఖాన్ రామ్ చరణ్ ని అవమానించాడంటూ ఓ సోషల్ మీడియా పోస్ట్ తెరపైకి వచ్చింది.
46
సల్మాన్, అమీర్ ఖాన్ లతో డాన్స్ చేస్తున్న షారుఖ్ ఖాన్... చరణ్ ని పిలిచాడట. ఇడ్లీ సాంబార్ పైకి రా అన్నాడట. ఈ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇడ్లీ సాంబార్ అని రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ పిలవడం నచ్చలేదంటూ ఆమె పోస్ట్ పెట్టారు.
56
అక్కడ సరదాకే పిలిచినప్పటికీ అంత పెద్ద స్టార్ హీరోని అవమానించడం తగదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. సౌత్ ఇండియా అంటే షారుక్ కి ఇంకా చులక భావన ఉందని ఆయన పిలుపుతో అర్థం అయ్యింది అంటున్నారు.
66
మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ షారుక్ ఖాన్ పై మండిపడుతున్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో రామ్ చరణ్ ఈ వేడుకలో డాన్స్ చేసిన విషయం తెలిసిందే