60 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇండియాలో ఏమూలకు వెళ్లినా.. షారుఖ్ పేరు తెలియని వారంటూ ఉండరు. ఈ పేరును సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులలో షారుఖ్ ఒకరు. విదేశాల్లోనూ షారుఖ్‌కు అభిమానులు ఉన్నారు.
అమితాబ్ నోట అల్లు అర్జున్ మాట. బన్నీ గురించి బిగ్ బీ ఏమన్నారంటే..? '
అంతే కాదు ఇండియాలో అత్యంత ధనవంతులైన నటులలో షారుఖ్ ఖాన్ మొదటి ప్లేస్ లో ఉన్నారు. సీరియల్ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి..బాలీవుడ్ ను శాసించే స్ధియికి ఎదిగిన షారుఖ్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. నటుడిగా ఎన్నో ఆటుపోట్లు చూశారు షారుక్ ఖాన్. కొంత కాల చాలా క్రూషియల్ స్టేజ్ ను చూశారు షారుఖ్ ఖాన్. జీరో సినిమా ప్లాప్ తరువాత బాద్ షా పని అయిపోయింది అనుకున్నారంతా.
దాదాపు 5 ఏళ్ళు కనిపించలేదు బాలీవుడ్ హీరో. ఈ టైమ్ లోనే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం.. బాలీవుడ్ లో సంచలనంగామారింది. ఇక ఆతరువాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు షారుఖ్. తన సినిమాకు 1000 కోట్ల కలెక్షన్స్ తో తాను గెలిచి.. బాలీవుడ్ ను కూడా పైకి లేపాడు బాద్ షా. ఇక షారుఖ్ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి.
బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఈ క్రమంలోనే తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమకు షారుఖ్ చేసిన సేవలకు గాను ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ అందరికి ఆశ్చర్యపరిచాయి. ఈక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన చివరి కోరిక గురించి వెల్లడించారు షారుఖ్.
ఆయనకు సినిమా మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసేలా చేశారు షారుఖ్ ఖాన్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే మీడియా ప్రతినిధి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదుయ్యింది. జీవితాంతం మీరు నటుడిగానే కొనసాగుతారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. షారుఖ్ ఇచ్చిన సమాధానం అందరిని షాక్ కు గురిచేసింది. తాను చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.
Shah Rukh Khan
ఏదైనా సినిమా సెట్‌లో యాక్షన్ చెప్పగానే తాను చనిపోవాలని, కట్ చెప్పాక కూడా పైకి లేవకూడదని చెప్పుకొచ్చారు. అలా నటిస్తూనే చనిపోవాలనేది తన చివరి కోరిక అంటూ షారుఖ్ మనసులో మాట బయట పెట్టారు. ఇక స్టార్‌డమ్‌కి ఎలా ఫీలవుతారన్న ప్రశ్నకు బదులిస్తూ..
తాను స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తానని, దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయని చెప్పుకొచ్చారు. ఇక తనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువన్న షారుఖ్. అయితే ప్రస్తుతం ప్రజలు చాలా సున్నితమనసున్నవారయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే మంచిదంటూ జోక్ చేశారు.