రామ్ చరణ్ కోసం రంగంలోకి షారుఖ్ ఖాన్, మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..

First Published | Nov 16, 2024, 10:34 PM IST

రామ్ చరణ్ కోసం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రంగంలోకి దిగబోతున్నారా..? బాలీవుడ్ లో చరణ్ క్రేజ్ ను  షారుఖ్ పెంచబోతున్నారా..? ఇంతకీ విషయం ఏంటి..? 

Game Changer Teaser

మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో  రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ తో దేశ వ్యాప్తంగా చరణ్ కు భారీగా క్రేజ్ వచ్చింది. ఇక ఆ క్రేజ్ ను అలానే కంటీన్యూ చేస్తూ.. పాన్ ఇండియా దర్శకుడు   శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ ను భారీ ఎత్తున రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు టీమ్. ఇక ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

Also Read: ముద్దు సీన్ కోసం మూడు రోజుల షూటింగ్, హీరోయిన్ తల్లి ముందే రొమాన్స్ చేసిన స్టార్ హీరో ఎవరు..?

కాస్త లేట్ అయినా.. ప్రమోషన్స్ ను మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ దానికి ఒక లెక్క ప్రకారం సెట్ చేసే విధంగా అన్ని భాషల్లో అందరు ప్రముఖులను రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ కు సబంధించిన ప్రమోషన్లు షురు అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి.  

శంకర్ మార్క్  డైరెక్షన్ .. శంకర్ మార్క్ పాటలు, వంకర్ మార్క్ కాన్సెప్ట్ తో సినిమా అద్భుతహా అనిపిస్తుందన్న నమ్మకం వ్యాక్తం చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది అంటున్నారు  అభిమానులు. సోషల్ మీడియా గేమ్ ఛేంజర్ కుసబంధించిన ప్రతీ అప్ డేట్ ను వైరల్ చేసేందుకు రెడీగా ఉన్నారు అభిమానులు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతోంది గేమ్ ఛేంజర్.  

Also Read:  స్టార్ డైరెక్టర్, రెండు బ్లాక్ బస్టర్ మూవీస్, రిజెక్ట్ చేసిన మహేష్ బాబు, ఏంటా సినిమా, ఎవరా దర్శకుడు..?


Game Changer

సంక్రాంతి కానుకగా జనవరి 10 న తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ప్రతీ భాషలో ఈసినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా రీసెంట్ గా టీజర్ ను లక్నోలోభారీ ఈవెంట్ పెట్టి  రిలీజ్ చేశారు. భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చి.. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఆడిటోరియం అదరిపోయేలా హడావిడి చేశారు ఫ్యాన్స్.

 Also Read:  ఓ హీరోయిన్ కోసం ఏకంగా 150 పాటలు పాడిన గాయని సుశీల

Game Changer

సంక్రాంతి కానుకగా జనవరి 10 న తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ప్రతీ భాషలో ఈసినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు టీమ్. అందులో భాగంగా రీసెంట్ గా టీజర్ ను లక్నోలోభారీ ఈవెంట్ పెట్టి  రిలీజ్ చేశారు. భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చి.. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేశారు. ఆడిటోరియం అదరిపోయేలా హడావిడి చేశారు ఫ్యాన్స్. 

ఇక ఈసినిమాను హిందీలో పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయడం కోసం మరో ప్లాన్ వేశారట టీమ్. శంకర్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకోసం వచ్చే నెల అంటే డిసెంబర్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను హిందీలో భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలను మనవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. 

ఆర్ఆర్ఆర్ కోసం సల్మాన్ ఖాన్ ను వాడేశారు. ట్రిపుల్ ఆర్ ఈవెంట్ కు సల్మాన్ రాగా. ఈసారి గేమ్ ఛేంజర్ కోసం షారుఖ్ ఖాన్ ను రంగంలోకి దింపబోతున్నారట టీమ్. బాలీవుడ్ లో జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు  షారుఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కు షారుఖ్ మంచి ప్రెండ్.  జవాన్,  పఠాన్ సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లో జరిగే టైమ్ లో సౌత్ ప్రమోషన్స్ అప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు.  
 

హైదరాబాద్ లో జవాన్ సినిమాని అభిమానులతో కలిసి థియేటర్ లో చూడాలి అని ఒక అభిమాని ట్విట్టర్ రిక్వెస్ట్ చేయగా, దానికి షారుఖ్ ఖాన్ సమాధానం చెప్తూ ‘కచ్చితంగా చేస్తాను..కానీ ఆరోజు నాతో పాటు రామ్ చరణ్ కూడా రావాలి’ అని అన్నాడు. దాంతో వీరి మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉందో అర్ధం అవుతోంది. బాలీవుడ్ లో షారుఖ్ తో పాటు.. సల్మన్ ఖాన్ తో మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. 

దాంతో షారుఖ్ ఖాన్ ను అడగటమే ఆలస్యం వెంటే ప్రమోషన్స్ కు ఒప్పుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు.  అంతే కాదు హిందీలో ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న బిగ్ బాస్ సీజన్ 18 వీకెండ్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా  వెళ్ళి గేమ్ చేంజర్ సినిమాను ప్రమోట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. చూడాలి మరి గేమ్ ఛేంజర్ మూవీ పరిస్థితి ఏమౌతుందో. 

Latest Videos

click me!