బిగ్ బ్రేకింగ్: నటి కస్తూరి అరెస్ట్! 

First Published | Nov 16, 2024, 9:31 PM IST

తెలుగువారిపై అనుచిత కామెంట్స్ చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ అయ్యారు. చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 

kasturi

బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలంటూ చెన్నై వేదికగా జరిగిన ఓ సభలో నటి కస్తూరి శంకర్ అనుచిత కామెంట్స్ చేయగా ఆమెపై కేసు నమోదు అయ్యింది. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ సైతం కొట్టి వేయడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 
 

ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న నటి కస్తూరి పరారీలో ఉన్నారు. తమిళనాడు పోలీసులు బృందాలుగా ఆమె కోసం వెతుకుతున్నారు. కస్తూరి హైదరాబాద్ లో ఉందన్న సమాచారంతో చెన్నై పోలీసులు ఇక్కడికి వచ్చారు. కాగా నవంబర్ 16 శనివారం ఆమెను పోలీసులు గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను చెన్నై తరలిస్తున్నారు. అటు తమిళనాడుతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో నటి కస్తూరి అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. 

కస్తూరి వివాదం పరిశీలిస్తే... కస్తూరి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. తమిళనాడులోని బ్రాహ్మణులకు ఎదురవుతున్న వేధింపులను వ్యతిరేకిస్తూ ఈ నెల 3న జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ కస్తూరి అనుచిత కామెంట్స్ చేశారు.  
 


సుమారు 300 ఏళ్ల క్రితం తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చారు. ఇక్కడి రాజుల అంతఃపురాల్లో ఆడవారికి సేవకులుగా ఉండేవారు. అలా వలస వచ్చినవారు తమిళులమని చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదంటున్నారని కస్తూరి ఆరోపణలు చేశారు. కస్తూరి తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. అలాగే కస్తూరి తెలుగువారికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కస్తూరి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంది.

నాకు తమిళనాడు పుట్టినిల్లు అయితే తెలుగు గడ్డ మెట్టినిల్లు లాంటిది. నేను తెలుగువారిని అవమానించలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలు నన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు. కస్తూరి పై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కి ఆమె అప్లై చేశారు. అయితే కోర్టులో కస్తూరికి చుక్కెదురైంది. 

కస్తూరి బెయిల్ పిటిషన్ మదురై హైకోర్టు కొట్టివేసింది. కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్ట్ మధురై బ్రాండ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కస్తూరి పరారీలో ఉండగా, పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు ఆమె పోలీసులకు పట్టుబడ్డారు.

 అమరన్ మూవీ పై సైతం కస్తూరి ఆరోపణలు చేయడం విశేషం. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఇటీవల విడుదలైన భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ బ్రాహ్మణుడు. ఆయన భార్య క్రిస్టియన్ ఎలా అవుతుంది.. అంటూ కస్తూరి అభ్యంతర కామెంట్స్ చేసింది. 
 

తమిళనాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కస్తూరి 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం గ్యాంగ్ వార్. అనంతరం నిప్పురవ్వ, అన్నమయ్య, మా ఆయన బంగారం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి టైటిల్ తో ఒక సీరియల్ చేసింది. 
 

Latest Videos

click me!