రజినీకాంత్ రోబో సినిమాను మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా..? ట్విస్ట్ ఇదే మరి.

First Published | Nov 22, 2024, 6:00 PM IST

అవునా.. నిజమా.. అననుకునే విధంగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ గతంలో చేసిన బ్లాక్ బస్టర్ మూవీ రోబోను ఓ స్టార్ హీరో మిస్ అయ్యాడని తెలుసా..? ఇంతకీ ఎవరా స్టార్..? కారణం ఏంటి..? 
 

ప్రస్తతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై సౌత్ సినిమా పెత్తనం చేస్తోంది. దక్షణాది హవాతో బాలీవుడ్ కామ్ అయిపోయింది. మన సినిమాలు ఆస్కార్ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ తో చుక్కలు చూపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియాను ఏలేస్తున్నాయి. టాలీవుడ్ నుంచి పుష్ప2, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Also Read:  రాజమౌళిని పోరా అంటూ అవమానించింది ఎవరు, జక్కన్న మర్చిపోలేని సంఘటన

అంతే కాదు టెక్నాలజీని వాడుకుని సినిమాలను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు సౌత్ మేకర్స్. కల్కీ లాంటి సినిమాలు ఆ కోవలోకే వస్తుంటాయి. అయితే ఇలాంటి అద్భుతాలను 15 ఏళ్ల క్రితమే చేశాడు సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్. రోబో అనే మహాద్భుతాన్ని అప్పుడే వెండితెరపై ఆవిష్కరించాడు. రోబో సినిమా కోసం అప్పట్లోనే గ్రాఫీక్స్ మాయాజాలం చేశాడు శంకర్. ఆ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. 


Also Read: కీర్తి సురేష్ ‌- శివకార్తికేయన్ లవ్ స్టోరీ నిజమేనా..? బ్రేకప్ కి కారణం ఎంటో తెలుసా !


ఇక ఈసినిమాలో రోబోగా, వసీకర్ గా రజినీకాంత్ నటన గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్  అయింది. రోబో సినిమాలో రజినీకాంత్ ను తప్పించి ఏ హీరోను ఊహించుకోలేము అంతలా ఈ సినిమాలో సెట్ అయ్యాడు. అయితే ఎవరికీ తెలియాని ఓ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా.. అసలు ఈసినిమాలో నటించాల్సింది రజనీకాంత్ కాదట బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా చేయాల్సి ఉందట.

Also Read: దేశాల్లో వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో కొడుకు

అవును ‘రోబో’ సినిమాలో రోబో పాత్రలో షారుక్ ఖాన్ ను  నటించాలని శంకర్ అనుకున్నారట. అంతే కాదు కథ కూడా చెప్పాడట, ఈ కథ విన్న షారుక్‌ ఖాన్‌.. అది బాగా నచ్చడంతో సినిమాను నిర్మించడానికి కూడా ముందుకు వచ్చాడట. ప్రీప్రొడక్సన్ స్టార్ట్ అయ్యే సమయానికి అభిప్రాయా భేదాలు రావడంతో ఈసినిమా నుంచి షారుఖ్ ఖాన్ తప్పుకున్నారట. 


Also Read: జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్ స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. రోబో సినిమా చేయడానికి డైరెక్టర్ శంకర్ షారుఖ్ ఖాన్ ను రెండేళ్లు డేట్స్ అడిగాడట. దాంతో అది కుదరదని షారుఖ్ చెప్పేశాడట. రెండేల్లు ఒకే సినిమాపై ఉండటం అంటే కష్టమని భావించిన బాద్ షా..రోబోను వదులుకోవల్సి వచ్చిందట. ఈసినిమా కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను కూడా ఫిక్స్ చేశారట టీమ్. 
 

ప్రియాంక కూడా రెండు నెలలు డేట్స్ ఇచ్చేసిందట. కాని రెండేళ్లు షూటింగ్ అంటే షారుఖ్  వదులుకోక తప్పలేదని అన్నారు. అంతే కాదు రోబో అద్భుతమైన సినిమా.. రజినీకాంత్ కు ఈసినిమా కరెక్ట్ గా సూట్ అయ్యింది. నేను చేస్తే.. ఇంత అద్భుతంగా వచ్చి ఉండేది కాదేమో అని అన్నారు షారుఖ్. ఈ సినిమా నుంచి తప్పుకున్నా కాని.. నేను శంకర్ ఫ్రెండ్స్ లాగే ఉన్నాము.  భవిష్యత్తులో మళ్లీ కలిసి పని చేద్దామని భావించి తప్పుకున్నాం ముందు ముందు మా కాంబోలో సినిమా రావచ్చు అని కూడా ఆయన అన్నారు. 

Latest Videos

click me!