సత్యదేవ్‌ `జీబ్రా` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Nov 22, 2024, 5:22 PM IST

సత్యదేవ్ హీరోగా, ధనంజయ్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం `జీబ్రా`. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

యంగ్‌ హీరో సత్యదేవ్‌ మంచి టాలెంటెడ్‌. కానీ సరైన సినిమాలు పడటం లేదు. భారీ హిట్‌ పడితే ఆయన రేంజ్‌ వేరే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇంకా సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన `జీబ్రా` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో `పుష్ప` ఫేమ్‌ ధనంజయ్‌ కీలక పాత్రలో నటించగా, ప్రియా భవానీ శంకర్‌, అమృతా అయ్యంగర్‌ హీరోయిన్లుగా నటించారు.

సత్యరాజ్‌ కీలక పాత్రలో నటించారు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని బాల సుందరం, ఎస్‌ ఎన్‌ రెడ్డి, దినేష్‌ సుందరం నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ నేడు శుక్రవారం(నవంబర్‌ 22)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సత్యదేవ్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
సూర్య(సత్యదేవ్‌) బ్యాంక్ ఆఫ్‌ ట్రస్ట్ అనే బ్యాంక్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా వర్క్ చేస్తుంటాడు. అమ్మని బాగా చూసుకోవాలి, సొంతంగా ఇళ్లు కొనుక్కోవాలనేది డ్రీమ్‌. మరో బ్యాంక్‌లో పనిచేసే స్వాతి(ప్రియా భవానీ శంకర్‌)తో ప్రేమలో పడతాడు. ఆమెని మ్యారేజ్‌ చేసుకుని, లైఫ్‌లో సెటిల్‌ కావాలనేది ఆయన సూర్య కల. ఇంతలో బ్యాంక్‌లో చిన్న మిస్టేక్‌ చేస్తుంది స్వాతి.

ఓ అకౌంట్‌లోకి నాలుగు లక్షలు పొరపాటుని ట్రాన్ఫర్‌ చేస్తుంది. దీంతో ఆ అమౌంట్‌ అతన వాడుకుంటాడు. మనీ కట్‌ అయిన వ్యక్తి గోల చేస్తుంటారు. దీనికోసం సూర్య హెల్ప్ తీసుకుంటుంది స్వాతి. బ్యాంక్‌లోని లూప్స్ ని వాడుకుని ఆ మొత్తాన్ని సర్దేస్తాడు. కానీ అనూహ్యంగా సూర్య పేరుతో ఉన్న అకౌంట్‌లోకి ఐదు కోట్లు వచ్చిపడతాయి.

ఆ మనీ తనదే అని గ్యాంగ్‌ స్టర్ ఆది(డాలి ధనంజయ్‌) బెదిరిస్తాడు. నాలుగు రోజుల్లో ఆ డబ్బు తన అకౌంట్లో వేయాలని సూర్యకి వార్నింగ్‌ ఇస్తాడు. అతనికి మనీ సర్దేందుకు సూర్య ఎలాంటి తప్పులు చేశాడు? దీనికి తన బ్యాంక్‌ని ఎలా వాడుకున్నాడు? చివరికి ఎలా సెటిల్‌ చేశాడు. దీనికి ఆనాథశ్రమానికి ఉన్న లింకేంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
బ్యాంక్‌ లావాదేవీలు, అందులో జరిగే స్కామ్‌ల గురించి ఆద్యంతం థ్రిల్లర్‌గా తెరకెక్కించిన మూవీ ఇది. `జీబ్రా` అంటేనే గజిబిజీగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ కూడా అలానే ఉంటుంది. ఈ సినిమా అర్థం కావాలంటే మినిమమ్‌ డిగ్రీ ఉండాలనేది కాదు, ఇంకా ఆ పైనే ఉండాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన్నీ ట్రాన్సాక్షన్‌ విషయంలో బ్యాంక్‌ల్లో ఎన్ని లూప్‌ హోల్స్ ఉంటాయి? వాటిని ఎంప్లాయిస్‌ ఎలా వాడుకుంటారు, ఎలాంటి ఫ్రాడ్‌ చేస్తారనే కళ్లకి కట్టినట్టు చూపించిన చిత్రమిది.

అయితే ఇది ఆ ఫ్రాడ్‌కి సంబంధించిన విషయాన్ని తెలియజేసే క్రమంలో రాసుకున్న స్క్రీన్‌ ప్లే మాత్రం అయోమయం గందరగోళం అనేట్టుగా సాగుతుంది. ఫస్టాఫ్‌ కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. లవ్‌ ట్రాక్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ వరకు బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే బ్యాంక్‌ లో స్వాతి చేసిన తప్పు సరిద్దిద్దే సీన్ లోకి సూర్య రావడంతో కథనం వేగం పుంజుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ ఈ క్రమంలో చేసే హడావుడి కాస్త ఎంగేజ్‌ చేసినా, అంతగా ఎక్కేలా లేదు.

దీనికితోడు చాలా కొత్త పాత్రలు, కొత్త ప్రాబ్లమ్స్ తెరపైకి రావడంతో కథనం ట్రాక్‌ తప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆది సూర్యకి వార్నింగ్‌ ఇవ్వడం, దానికోసం సూర్య పడే స్ట్రగుల్స్, ఆయన వేసే ఎత్తులు, బ్యాంక్‌లో చేసే ఫ్రాడ్‌ ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇంటర్వెల్‌ వచ్చేసరికి కథ మరింత ఆసక్తరంగా మారుతుంది. 
 

ఇక రెండో భాగం నుంచి కథ ట్రాక్‌ తప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఐదు కోట్ల కోసం అడు ఆదికి పంపించాలని, మరోవైపు బెన్నీ ఫ్యామిలీకి పంపించాలని, ఇంకోవైపు బ్యాంక్‌ కన్నం వేయడానికి ఇలా ఒక విచిత్రమైన గేమ్‌లా సాగుతుంది. ఏ సీన్‌ ఎందుకు వస్తుందో, ఎవరు ఎందుకు అలా చేస్తున్నారో అంతా కన్‌ఫ్యూజన్‌గా మారుతుంది. సమస్య నుంచి బయటపడేందుకు వేసే ఎత్తులు, బ్యాంక్‌లో డబ్బు కోట్టేందుకు వేసిన ప్లాన్‌, దాని ఎగ్జిక్యూషన్‌ సస్పెన్స్ తో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది.

కానీ అది బాగా సాగదీసినట్టుగా ఉండటంతో బోర్‌ తెప్పిస్తుంది. ఈ ఎపిసోడ్‌ ఇటీవల వచ్చిన `లక్కీ భాస్కర్‌` సినిమాని తలపిస్తుంది. డాలీ ధనంజయ్‌ ఎపిసోడ్‌లో `కేజీఎఫ్‌` స్టయిల్‌ కనిపిస్తుంది. ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టుగా ఉంటాయి, ఇది కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తుంది. ఓ విషయాన్ని తిప్పి తిప్పి చెప్పినట్టుగా కథనం కూడా రకరకాలుగా తిరిగి చాలా కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తుంది. క్లైమాక్స్ వరకు అలానే నడుస్తుంది. ఎండింగ్‌ కూడా అలానే ఉంటుంది.

అయితే ఆది బ్యాక్‌ గ్రౌండ్‌, ఆయన జర్నీని భారీ స్థాయిలో చూపించారు. దీనికి అసలు కథకి సంబంధం లేదు. ఆది మరో కథ. ఇలా అంతా కన్‌ఫ్యూజ్డ్ బ్యాంక్‌ చుట్టూ తిరిగే డ్రామా `జీబ్రా` అని చెప్పొచ్చు. స్క్రీన్‌ ప్లే పరంగా సరళంగా సినిమాని నడిపిస్తే బాగుండేది. దీంతో ఇప్పుడు గందరగోళంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారిందని చెప్పొచ్చు. 

నటీనటులుః
సూర్య పాత్రలో సత్యదేవ్‌ అదరగొట్టాడు. తనకు యాప్ట్ అయిన పాత్రలో కనిపించాడు. మెప్పించాడు. తనదైన తెలివి గేమ్‌తో అలరించారు. ఇక గ్యాంగ్‌ స్టర్ ఆది పాత్రలో ధనంజయ్‌ చాలా బాగా చేశాడు. సత్యదేవ్‌ కంటే ఆయనక ఎక్కువగా ఎలివేషన్లు, యాక్షన్‌ ఎపిసోడ్లు పెట్టారు. దీంతో అసలు హీరో ఆయనే అనే ఫీలింగ్‌ కలుగుతుంది.

ఇంకోవైపు బ్యాంక్‌ ఎంప్లాయ్‌గా ప్రియా భవానీ శంకర్‌ చాలా బాగా చేసింది. మెప్పించింది. తన ప్రత్యేకతని చాటుకుంది. సత్య కామెడీ సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. సత్యరాజ్‌ విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. సునీల్‌ కామెడీ విలన్‌ పాత్రలో అదరగొట్టాడు. తన మార్క్ ని చూపించారు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదని చెప్పొచ్చు. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి కెమెరా వర్క్ బాగుంది. సత్య పోన్మర్‌ మంచి విజువల్స్ అందించారు. రవి బన్సూర్‌ మ్యూజిక్‌ సినిమాకి హైలైట్. భారీ సినిమాల స్థాయిలో ఇచ్చాడు. బీజీఎం ఆకట్టుకుంది. సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్‌ పరంగా రాజీపడలేదనిపిస్తుంది. రిచ్‌గా ఉంది సినిమా. దీంతోపాటు దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ మంచి కథని రాసుకున్నాడు. కానీ దాన్ని తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్‌ చేయలేకపోయాడు. ఒప్పుడు సుకుమార్‌ ఎలా అయితే కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేశాడో, ఈ మూవీ విషయంలోనూ అదే జరిగింది. అర్థమయ్యేలా, సరళంగా సినిమాని తెరకెక్కిస్తే బాగుండేది. 

ఫైనల్‌గాః టైటిల్‌ తగ్గట్టుగానే `జీబ్రా`లో సాగే మూవీ. సినిమా అర్థం కావాలంటే మినిమమ్‌ డిగ్రీకి పైనే చదవాలి. 

రేటింగ్ః 2 
Read more: విశ్వక్‌ సేన్‌ `మెకానిక్‌ రాకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

Latest Videos

click me!