అఖండ 2 నిరాశ పరచడంతో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాల గురించి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో విడుదలైన అఖండ 2 తాండవం చిత్రంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.
ప్రస్తుతం ఇండియన్ సినిమా మొత్తం సీక్వెల్స్ హవా సాగుతోంది. వీటిలో ముందుగా రెండు భాగాలుగా ప్రకటించిన సినిమాలు కొన్ని అయితే ఒక సినిమా హిట్ అయ్యాక దానికి సీక్వెల్ ప్రకటించినవి మరికొన్ని. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే సీక్వెల్ చిత్రాలు నందమూరి హీరోలకు ఏమాత్రం కలసి రావడం లేదు. బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం పూర్తిగా నిరాశ పరచడంతో అభిమానుల్లో ఈ చర్చ మొదలైంది.
25
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్
కోవిడ్ తర్వాత 2021లో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం అఖండ విడుదలైంది. ఆ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా సంచలనం సృష్టించింది. బాలయ్య పోషించిన అఘోర పాత్ర అఖండ బాగా క్లిక్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలి అని బోయపాటి డిసైడ్ అయ్యారు. ఈ చిత్రానికి సీక్వల్ గా వచ్చిన అఖండ 2 తాండవం ఇటీవల విడుదలైంది.
35
అయోమయంలో సీక్వెల్ చిత్రాలు
కానీ ఈ చిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. మరోవైపు వార్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన వార్ 2 ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రంతో పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. తారక్ కి ఈ సీక్వెల్, బాలీవుడ్ ఎంట్రీ ఏమాత్రం కలసి రాలేదు. మరోవైపు దేవర 2 పరిస్థితి ఏంటి అనేది కొరటాల శివకి అయినా తెలుసా అంటే అనుమానమే. ఎన్టీఆర్ కాని, కొరటాల కాని దేవర 2 ఊసే ఎత్తడం లేదు.
దేవర చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయింది కానీ.. కంటెంట్ పై అంత మంచి రివ్యూలు రాలేదు. అందుకే ఈ సీక్వెల్ పై ఎవరూ ఆసక్తిగా లేరు. మరోవైపు కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా అంతే. కళ్యాణ్ రామ్ ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథాంశంతో నటించిన డెవిల్ చిత్రం మంచి ప్రయత్నమే. కానీ కమర్షియల్ గా అది డిజాస్టర్. ఆ చిత్రానికి కూడా కళ్యాణ్ రామ్ సీక్వెల్ చేయాలి అనుకున్నారు.
55
కళ్యాణ్ రామ్ బింబిసార 2 ఎక్కడ ?
డెవిల్ నిరాశ పరచడంతో డెవిల్ 2 అటకెక్కింది. మరోవైపు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ బింబిసార చిత్రం. ఆ చిత్రానికి క్లైమాక్స్ లోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కూడా మారిపోయారు. కానీ ఇంతవరకు బింబిసార 2కి సంబంధించిన ప్రకటన లేదు. ఇదంతా చూస్తుంటే నందమూరి హీరోలకు సీక్వెల్ చిత్రాలు కలిసి వస్తున్నట్లు అనిపించడం లేదు.