Bigg Boss 9 Telugu : పీఆర్ ల కన్నింగ్ గేమ్.. కళ్యాణ్ కోసం డీమాన్ పవన్ ని బలి చేశారుగా..!

Published : Dec 20, 2025, 01:01 PM IST

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి వేధిక సిద్ధం అయ్యింది. ఆదివారం సాయంత్రం ఈ గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ కానుంది. కానీ, శనివారం ఉదయం నుంచే ఎపిసోడ్ షూటింగ్ మొదలుపెట్టారు.

PREV
13
Bigg Boss 9 Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగియడానికి వచ్చింది. రేపు సాయంత్రానికి విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఆల్రెడీ.. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ కోసం షూటింగ్ మొదలైంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేశారు. ఇప్పుడు స్టేజీ మీద కూడా డ్యాన్స్ పర్ఫ్మార్మెన్స్ లు ఇవ్వనున్నారు. ఈ శనివారం షూట్ లో టాప్ 5 లో ఉన్నవారి నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

23
ఆదివారం ఫినాలే ఎపిసోడ్జజజ

టాప్ 3 లో ఉన్న ముగ్గురికి సంబంధించిన షూటింగ్ ఆదివారం జరగనుంది. విన్నర్ అనౌన్స్మెంట్ మాత్రం.. ముందే లీక్ అవ్వగుండా ఉండేందుకు లైవ్ లో ప్రకటించాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం ప్రకారం సంజన టాప్ 5 లో బయటకు రానుంది.

అయితే... మొదటి రెండు రోజుల ఓటింగ్ లో ఇమ్మాన్యుయల్ టాప్ 4 లో, డీమాన్ టాప్ 3లో ఉన్నారు. ఇక తనూజ, కళ్యాణ్ లు మొదటి, రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నారు. కళ్యాణ్ కంటే.. ఒకటి రెండు శాతం ఓట్లు తనూజ కి ఎక్కువగా పోల్ అయినట్లు లీక్స్ వచ్చాయి. దీంతో... బయట పీఆర్ గేమ్స్ మొదలుపెట్టారు. కళ్యాణ్ ఓటింగ్ పెంచడం కోసం డీమాన్ ఓటింగ్ ని తగ్గించే పనిలో పడ్డారు.

33
పడిపోయిన డీమాన్ ఓటింగ్...

కళ్యాణ్, తనూజలకు 60 శాతం ఓటింగ్ పడిపోతుందని... ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా డీమాన్ విన్నర్ అవ్వలేడని.. అతనికి ఓట్లు వేయడం వేస్టని.. ఆ ఓట్లు కళ్యాణ్ కి వేస్తే... అతను విన్నర్ అవుతాడంటూ పీఆర్స్ జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. వారు చేసిన కుట్రలు కూడా ఫలించాయి. డీమాన్ ఎలాగూ విన్నర్ అవ్వడు కదా అని చాలా మంది కళ్యాణ్ కి ఓటింగ్ పెంచేశారట. ఫలితంగా మూడో స్థానంలో ఉండాల్సిన డీమాన్ కాస్త... నాలుగో స్థానానికి పడిపోయాడు. బయటకు వచ్చిన లీక్స్ ప్రకారం... కళ్యాణ్ కి ఓటింగ్ పెరిగిందని సమాచారం. ఈ లెక్కన ఈసారీ లేడీ విన్నర్ లేరని తెలుస్తోంది. పీఆర్ లు అందరూ కలిసి డీమాన్ ని టార్గెట్ చేస్తే.... చాలా మంది ఎక్స్ కంటెస్టెంట్స్, కొందరు సీరియల్ నటులు కలిసి తనూజను టార్గెట్ చేశారు. వీరిందరినీ టార్గెట్ చేసి మరీ కళ్యాణ్ ని విన్నర్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. మరి... రిజల్ట్ ఎలా వస్తుందో తెలియాలంటే.. ఆదివారం సాయంత్రం వరకు ఆగాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories