Superstar Krishna : ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన సూపర్ స్టార్ కృష్ణను.. ఒకే ఒక్క సినిమాతో చిరంజీవి భయపెట్టాడని మీకు తెలుసా? మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి కృష్ణ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్టీ రామారవు, అక్కినేని నాగేశ్వరావు రెండు కళ్లుగా ఉన్నారు. టాలీవుడ్ ను నిలబెట్టి.. గుర్తింపు వచ్చేలా చేశారు. ఆ ఇద్దరు హీరోల ప్రభావం తగ్గుతున్న టైమ్ లో.. ఇండస్ట్రీలోకి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ, శోభన్ బాబు మంచి ఫామ్ లోకి వచ్చి.. వరుస సినిమాలతో దూసుకుపోయారు. చిరంజీవి వచ్చేవరకు టాలీవుడ్ లో కృష్ణకు, శోభన్ బాబుకు పోటీ అనేది లేకుండా పోయింది. ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ ను ఏలేశారు. వరుసగా హిట్ సినిమాలతో థియేటర్లపై దండయాత్ర చేశారు.
25
పరిశ్రమలో మార్పులు తెచ్చిన కృష్ణ..
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు హీరోలుగా దూకుడు మీద ఉన్నప్పుడు.. వారిని దాటి సక్సెస్ సాధించడం చాలా కష్టమైన పని. కానీ కృష్ణ చాలా తెలివిగా ఆలోచించి.. తన ట్యాలెంట్ చూపించాడు. టాలీవుడ్ కు కొత్త కొత్త టెక్నాలజీలు పరిచయం చేశాడు. అప్పటి వరకూ ఏ హీరో టచ్ చేయని జానర్ లో సినిమాలు ప్రయత్నించాడు. యాక్షన్ సీన్స్, కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, కలర్ స్క్రీన్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు.. రకరకాల పాత్రను ప్రయత్నించి.. తెలుగు ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు.
35
చిరంజీవి రాకతో మారిన పరిస్థితి..
ఎన్టీఆర్ ఏఎన్నార్ లను దాటుకుని.. స్టార్ హీరోగా ఎదగడానికి కృష్ణ కొత్తకొత్త కాన్పెస్ట్ లను తెరపైకి తీసుకువస్తే.. కృష్ణ, శోభన్ బాబుల నుంచి ఆడియన్స్ చూపును తనవైపుకు తిప్పుకోవడం కోసం చిరంజీవి డ్యాన్స్ ను నమ్ముకున్నాడు. టాలీవుడ్ కు మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ ను పరిచయం చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. కృష్ణ ప్రభంజనానికి బ్రేక్ వేసి.. తన డ్యాన్స్ మూమెంట్స్ తో టాలీవుడ్ లో చరిత్ర సృష్టించాడు చిరంజీవి. అప్పటి వరకూ మెగాస్టార్ లా డ్యాన్స్ చేయగలిగే హీరో టాలీవుడ్ లో మరెవరు లేకపోవడం.. చిరంజీవికి బాగా కలిసి వచ్చింది. దానికి తోడు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా మెగా ఇమేజ్ ను పెంచేశాయి.
సూపర్ స్టార్ కృష్ణ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ చిరంజీవి.. చిన్న చిన్న సినిమాలు చేస్తూ.. ఖైదీ సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారాడు. ఈసినిమా తో అప్పటికే హీరోలుగా ఉన్న కృష్ణ, శోభన్ బాబులకు కాస్త భయం స్థార్ట్ అయ్యింది. ఖైదీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చూసిన తరువాత.. కృష్ణలో ఆలోచన పెరిగిపోయింది. ఆ టైమ్ లోనే వరుసగా ప్లాప్ సినిమాలు పడుతుండటంతో.. మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఏం చేయాలా అని సూపర్ స్టార్ కృష్ణ ఆలోచనలో పడ్డారు. వెంటనే రిస్క్ చేసి ఓ సినిమాను స్టార్ట్ చేశారు. అదే సింహాసనం.
55
చిరంజీవికి చెక్ పెట్టడానికి కృష్ణ సాహసం..
మెగాస్టార్ చిరంజీవి ప్రభంజనం తట్టుకోవడం కోసం.. కృష్ణ సింహాసనం నినిమాను స్టార్ట్ చేశాడు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ.. బడ్జెట్ సమకూర్చాడు, తానే మొదటి సారి డైరెక్షన్ చేస్తూ.. నిర్మిస్తూ.. ఈసినిమాను తెరకెక్కించాడు. ఈసినిమాలో ఎన్నో విశేషాలు దాగున్నాయి. ఈసినిమా కోసం చాలా కష్టపడ్డారు కృష్ణ. చిరంజీవి ప్రభావం నుంచి తట్టుకుని నిలబడాలని గట్టిగా ప్రయత్నం చేశాడు. ఆయన కష్టం వృధా పోలేదు... సింహాసనం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కృష్ణ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే.. ఈసినిమాకు వచ్చే జనాలను ఆపడం సాధ్యం కాక...బెజవాడలో పోలీసులు 144 సెక్షన పెట్టేంతగా హిట్ అయ్యింది. సూపర్ స్టార్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా దెబ్బకు మరో పదేళ్లు కృష్ణకు తిరుగులేకుండా పోయింది.