BrahmaMudi 16th February Episode:రుద్రాణికి స్వప్న చుక్కలు, నాటకం మొదలుపెట్టిన కావ్య, అయోమయంలో రాజ్

First Published | Feb 16, 2024, 11:02 AM IST

దేవుడు నీకు నోరు ఇచ్చి బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయాడని, మా కావ్య బ్రెయిన్ ఇచ్చి నోరు ఇవ్వడం మర్చిపోయాడు అని సెటైర్ వేస్తుంది. అయితే.. స్వప్నను పూర్తిగా చెప్పమని ఇందిరాదేవి అంటుంది.

Brahmamudi

BrahmaMudi 16th February Episode: కావ్య పై దొంగతనం ముద్ర వేయాలని రుద్రాణి, అనామిక చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ ఆ ప్లాన్ ని స్వప్న మొత్తం రివర్స్ చేసింది. మా కావ్య జీవితంలో ఇంత పెద్ద నింద పడేసారికి షాక్ లో ఉండి ఉంటుంది. ఆ రూ.2లక్షలు మా కావ్యనే నాకు ఇచ్చింది అని స్వప్న చెబుతుంది. ఆ మాట విని కావ్య షాకౌతుంది. కావ్యతోపాటు రుద్రాణి, అనామికలు కూడా షాకౌతారు. వెంటనే రుద్రాణి.. స్వప్న చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసి.. ఆ రూ.2లక్షలు ఖర్చుపెట్టి నీకు నచ్చినట్లు షాపింగ్ చేసుకొని వచ్చావా అని అడుగుతుంది. వెంటనే స్వప్న.. దేవుడు నీకు నోరు ఇచ్చి బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయాడని, మా కావ్య బ్రెయిన్ ఇచ్చి నోరు ఇవ్వడం మర్చిపోయాడు అని సెటైర్ వేస్తుంది. అయితే.. స్వప్నను పూర్తిగా చెప్పమని ఇందిరాదేవి అంటుంది.

Brahmamudi

‘ కావ్య నాకు రూ.2లక్షలు ఇచ్చింది నిజం. నాకు వాడుకోవడానికి కాదు, పుట్టింటికి పంపడానికి అస్సలు కాదు. అది ఆఫీసుకు వెళ్లడం మొదలుపెట్టింది. ఈలోపే మీరు తాళం చెవులు చేతిలో పెట్టారు. అది లేనప్పుడు ఇంట్లోవాళ్లకు ఏ అవసరాలు వస్తాయో అని , ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని.. అది వచ్చే వరకు నా దగ్గరే ఉంచమని చెప్పి వెళ్లింది’అని స్వప్న అంటుంది. 

వెంటనే రుద్రాణి అబద్ధం అని అంటుంది. అవునా.. అయితే నిజం ఏంటో చెప్పమని స్వప్న అడుగుతుంది. అక్కా, చెల్లెళ్లు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని రుద్రాణి అంటుంది. అప్పుడు స్వప్న.. తాను డబ్బులు ఖర్చు అయ్యాయని చెప్పలేదని, డబ్బులు పోయాయని కూడా చెప్పలేదని మరి, అబద్దం అని ఎలా అంటారు అని రివర్స్ కౌంటర్ వేస్తుంది. కారణం చెప్పండి అని రుద్రాణి ని ప్రశ్నిస్తుంది.


Brahmamudi

ఇందిరాదేవి కూడా.. స్వప్న చెప్పడం పూర్తికాకముందే అబద్ధం అని ఎందుకు అన్నావ్ అని అంటుంది. ఇక.. రుద్రాణి తప్పించుకోవడానికి పాత విషయాలు తీస్తుంటే.. గతం గురించి  తేవద్దని.. ఇప్పటి విషయం చెప్పమని అపర్ణ అంటుంది. రుద్రాణి నోటికి అడ్డు అదుపు ఉండదులే కానీ.. ఆ డబ్బు ఏమైందో చెప్పమని సుభాష్ అడుగుతాడు. అయితే.. తన దగ్గరే ఉన్నాయి అని స్వప్న చెబుతుంది. భద్రంగా దాచి పెట్టానని, తన చేతిలో షాపింగ్ బ్యాగ్స్ లోపలపెట్టి.. ఆ డబ్బులు తెస్తాను అని చెప్పి వెళ్తుంది. వచ్చేటప్పుడు ఆ డబ్బులు తెచ్చి అపర్ణ చేతిలో పెడుతుంది.  స్వప్న ఇచ్చిన ట్విస్ట్ కి రుద్రాణి, అనామికలకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.

Brahmamudi

ఇక.. డబ్బు చేతికిరావడంతో అపర్ణ రెచ్చిపోతుంది. ధాన్యలక్ష్మి పేరు ఎత్తకుండా ఇప్పటి వరకు చాలా మాటలు అన్నారు కదా.. ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా అని అపర్ణ అడుగుతుంది. వెంటనే, ప్రకాశం తన భార్యను, సుభాష్ రుద్రాణి పై సెటైర్లు వేస్తారు. ఇక స్వప్న.. ఇప్పుడు మాట్లాడండి నా చెల్లి గురించి ఎవరు మాట్లాడతారో అని అంటుంది.

ఇక ఇందిరాదేవి కూడా.. కావ్య ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించిందని, ఇంట్లో ఎవరూ ఇబ్బంది పడకూడదని ఇలా చేస్తే... ఎన్ని మాటలు అన్నారు.. ధాన్యలక్ష్మి ని పిలిచి మరీ.. ఎవరి మీద అక్కసు ఎవరి మీద చూపిస్తున్నావ్..? గయ్యాళి దానిలా తయారౌతున్నావ్.. నీది కాని పెత్తనం నెత్తి మీద వేసుకుంటున్నావ్ ని పిచ్చి తిట్లు తిడుతుంది

Brahmamudi

ఇక స్వప్న.. మా పుట్టింటికి డబ్బులు పంపిందని ఆరోపణలు చేశారు.. తాను నిర్దోషి అని తేలినా కూడా.. మా కావ్య ఒక్కమాట కూడా మాట్లాడలేదని , అది తన గొప్పతనం అని చెల్లెలిని వెనకేసుకొస్తుంది. కావ్య తప్పు లేదని తేలడంతో అపర్ణ ఊగిపోతుంది. ఇప్పటి వరకు తన దగ్గర సాక్ష్యం లేదని  ఊరుకున్నానని.. నా కోడలిని ఏమన్నావ్ అని సీరియస్ అవుతుంది. ప్రకాశం కూడా భార్యను తిట్టడంతో.. ధాన్యలక్ష్మి లోపలికి వెళ్లిపోతుంది.ఇంటి తాళాలుపోతే కొత్తవి కొనుక్కోవచ్చని, అది ఈ ఇంటి గౌరవం అని, ఇలాంటి వాళ్లు ఎప్పుడూ బురద జల్లడానికి చూస్తూ ఉంటారని  అపర్ణ.. కావ్యకు సలహా ఇచ్చి వెళ్లిపోతుంది. స్వప్న కూడా లోపలికి వెళ్లిపోతుంది. అయితే.. జరిగింది మర్చిపోమ్మని నీ కాపురం చూసుకో అని ఇందిరాదేవి సలహా ఇస్తుంది.

Brahmamudi

ఇక బెడ్రూమ్ లోపలికి వచ్చిన రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. లాకర్ లో నువ్వు కాజేసిన డబ్బు..స్వప్న కొట్టేసేలా దాచిపెట్టావా అని అడుగుతాడు. ఆ డబ్బులు స్వప్నకు దొరికే ఛాన్స్ లేదని రుద్రాణి అంటుంది. మరి.. స్వప్నకు అంత డబ్బు ఎలా దొరికింది అని రాహుల్ అంటాడు. అవును కదా అని రుద్రాణి తాను డబ్బులు దాచిన ప్లేస్ లో వెతుకుతుంది. అయితే.. అక్కడ డబ్బు కనిపించదు. అయితే... ట్విస్ట్ ఏంటంటే.. అక్కడ రుద్రాణి రెండు కాదు.. ఐదు లక్షలు దాస్తుంది. ఆ మొత్తం స్వప్న కొట్టేస్తుంది. ఇంట్లో వాళ్లకు తెలీకుండా తాను దాచుకున్న రూ.3లక్షలు కూడా పోయాయని లబోదిబోమని అంటుంది.

Brahmamudi

అప్పుడే స్వప్న ఎంట్రీ ఇచ్చి.. మా చెల్లినే ఇరికించాలని చూస్తారా..? మీకు నేనే కరెక్ట్ అని బుద్ధి చెబుతుంది. ఇదే విషయం ఇంట్లో అందరికీ చెబుతాను అని రాహుల్ అంటే.. అవునా.. లాకర్ లో నుంచి డబ్బు తీసింది మీరే అని నేను కూడా చెబుతాను అని స్వప్న బెదిరిస్తుంది. దీంతో... ఏమీ చేయలేక రుద్రాణి, రాహుల్ లు నోరు మూసుకుంటారు.

Brahmamudi

అక్కడి నుంచి బయటకు వచ్చిన స్వప్నకు కావ్య ఎదురౌతుంది. తనను పెద్ద ప్రమాదం నుంచి కాపాడినందుకు స్వప్న థ్యాంక్స్ చెబుతుంది. కావ్య కంటి నిండా నీళ్లతో తన అక్కను కౌగిలించుకొని మరీ థ్యాంక్స్ చెబుతుంది. అయితే.. గతంలో నువ్వు నన్ను కాపాడావు కాబట్టి... ఇప్పుడు నేను కాపాడాను అని స్వప్న అంటుంది. లేదక్కా నువ్వు మారిపోయావ్ అని కావ్య అంటే.. నేను మారలేదు.. మారితే ఈ ఇంట్లో బతకలేం అని.. మంచితనంతో పుట్టింది నువ్వే అని.. నేను నాకోసమే పుట్టాను అని చెబుతుంది. మన మధ్య ఎన్ని తేడాలు ఉన్నా మూడో మనిషి వస్తే, తొక్కి పట్టి నార తీస్తా అని స్వప్న అంటుంది. నువ్వు మంచి రాక్షసివి అని కావ్య అంటుంది.  సరే తాను వెళతానని.. మా అత్త, మొగుడు నన్ను తిట్టుకుంటూ ఉంటారు అని అంటుంది. ఇద్దరూ హాయిగా నవ్వేసుకుంటారు.

Brahmamudi

ఇక రాత్రిపూట రాజ్ తన బెడ్రూమ్ కి వెళ్తుంటే వాళ్ల నానమ్మ ఆపేస్తుంది. ఏమైంది నానమ్మ అంటే మీ కాపురం సరిగానే ఉందా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావ్ అంటే.. ఈ మధ్య కావ్య చాలా డల్ గా ఉంటోందని చెబుతుంది. అయితే.. వాళ్ల నానమ్మకు డౌట్ వచ్చిందని.. ఆమె ముందు కావ్యను కళావతి అని పిలిచి.. బాగానే ఉన్నామని కవరింగ్ ఇస్తాడు. ఆ తర్వాత పైకి వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లిన తర్వాత.. చూశారా అమ్మమ్మ మీ మనవడి నాటకాలు అంటే.. అందుకే నువ్వు కూడా నీ నాటకం షురూ చెయి.. నీ వెనక నేను ఉన్నాను అని సపోర్ట్ చేస్తుంది.

ఇక కావ్య పడుకోవడానికి బెడ్రూమ్ కి వెళ్లేసరికి రాజ్ కావాలని శ్వేతతో మాట్లాడుతున్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తాడు. అయితే.. కావ్య అదేమీ పట్టించుకోనట్లుగా.. తన యాక్టింగ్ మొదలుపెడుతుంది. నేను ఇక్కడ పడుకుంటే మీకు ఇబ్బందిగా ఉండి ఫ్రీగా మాట్లాడుకోరేమో.. నేను బయటకు వెళ్లి పడుకుంటాను అని అంటుంది. మళ్లీ వెంటనే.. నేను వెళ్లి కింద సోఫాలో పడుకుంటే.. అనామిక పడుకున్నప్పుడు జరిగిన రచ్చ మళ్లీ అవుతుందేమో.. మీరు శ్వేత మెడలో తాళికట్టి.. నేను ఆటో ఎక్కి మా ఇంటికి వెళ్లే వరకు ఈ విషయం బయటకు రానివ్వను అని చెబుతుంది. నేను వినకుండా చెవిలో కాటన్ పెట్టుకుంటాను.. శ్వేతను అక్క అని పిలవాలో, చెల్లి అని పిలవాలో తనని అడిగి చెప్పండి అని చప్పి పడుకుంటుంది. అసలు.. కావ్య  ఇలా షాకివ్వడంతో రాజ్ కి ఏమీ అర్థం కాదు. జెలస్ ఫీలవ్వాలని తాను ఇలా చేస్తుంటే.. ఇలా చేస్తోందేంటని.. నిజంగానే నన్ను వదిలేస్తున్నందుకు దరిధ్రం పోయిందని సంతోషపడుతుందా అని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!