చిన్నప్పుడే అలాంటి కోరికలు, నాగబాబు ఎలాంటి వారంటే... ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ సెన్సేషనల్ కామెంట్స్!

First Published | Feb 16, 2024, 12:15 PM IST


ఒకప్పడు జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసేవాడు సాయి తేజ. సడన్ గా అమ్మాయిగా మారి షాక్ ఇచ్చాడు. తాను ట్రాన్స్ జెండర్ కావడం వెనకున్న పరిస్థితులు, కారణాలు సాయి తేజా చెప్పుకొచ్చాడు. 
 

జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసేవాడు సాయి తేజ. కొన్నాళ్ళు జబర్దస్త్ లో ఉన్న సాయి తేజ సడన్ గా జబర్దస్త్ కి దూరం అయ్యాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ షోలో దర్శనం ఇచ్చాడు. 
 

Maanas

బిగ్ బాస్ సీజన్ 4లో ప్రియాంక సింగ్ గా అడుగుపెట్టింది. సాయి తేజ ప్రియాంక సింగ్ కావడం ఏంటని జనాలు వాపోయారు. ఈ క్రమంలో ప్రియాంక సింగ్ వివరణ ఇచ్చింది. బిగ్ బాస్ వేదికగా తన జెండర్ మార్చుకున్నట్లు చెప్పింది. 


నేను ఇప్పుడు ప్రియాంక సింగ్ ని. నాకు చిన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండటం ఇష్టం. అందుకే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాను. ఈ విషయం మా నాన్నకు కూడా తెలియదు. నన్ను క్షమించాలని బిగ్ బాస్ వేదికగా కోరుకుంది. 

బిగ్ బాస్ షోలో ప్రియాంక సింగ్ రాణించింది. ఆమె చాలా వారాలు హౌస్ లో ఉంది. సీరియల్ నటుడు మానస్ ని ప్రియాంక సింగ్ ఇష్టపడటం విశేషం. అతనితో సన్నిహితంగా ఉండేది. మానస్ ఒక లైన్ మైంటైన్ చేశాడు. ఆమెతో స్నేహం కొనసాగిస్తూనే దూరం గా ఉన్నాడు. 
 

తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ కీలక కామెంట్స్ చేసింది. ఆమె అమ్మాయిగా మారడం వెనుకున్న కారణాలు చెప్పింది. బాల్యం నుండే ప్రియాంక సింగ్ కి అమ్మాయిగా ఉండాలి అనిపించేదట. తన చెల్లెళ్ళ యూనిఫార్మ్ వేసుకుని సంబర పడేదట. చిన్నపిల్లోడు కావడంతో తల్లిదండ్రులు కూడా సంతోష పడేవారట. 

అమ్మాయిగా ఉండాలని చిన్నప్పటి నుండే ఆలోచనలు వచ్చేవట. ఆపరేషన్ కోసం డబ్బులు దాచుకుందట. అదే సమయంలో ఆమెకు అనారోగ్యం బారిన పడిందట. ఆర్థటైసిస్  రావడంతో కొన్నాళ్ళు మంచానికే పరిమిత్యం అయ్యిందట. అప్పుడు నాగబాబు ఆమెకు డబ్బులు పంపేవారట. 

నాగబాబు నాకు దేవుడన్న సాయి తేజ ఆయన మీద అభిమానం చాటుకుంది. సాయి తేజ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలనాలు చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో సంచలనం రేపుతుంది. ఆమె బోల్డ్ ఫోటోల మీద నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Latest Videos

click me!