వరలక్ష్మి శరత్ కుమార్ అంటే సిల్వర్ స్క్రీన్ పై లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తుకు వస్తారు. ఆమె నటించే అన్ని చిత్రాల్లో వరలక్ష్మి పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది. కథకి కీలకం అవుతుంది. క్రాక్, వీర సింహారెడ్డి, హను మాన్ ఇలా పలు సూపర్ హిట్ చిత్రాలు వరలక్ష్మికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. సమంత యశోద చిత్రంలో ఆమె నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది.