జమ్కు జమా లస్క్ టపా మీనింగ్ ఏంటని అడిగిన విజయశాంతి... డైరెక్టర్ ని అడగమన్న చిరు, ఆయన ఏం చెప్పాడంటే?

Published : Jun 17, 2024, 02:37 PM IST

ఓ సినిమాలో విజయశాంతిని చిరంజీవి జమ్కు జమా లస్క్ టపా అంటుంటాడు. ఆ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాలని విజయశాంతి అనుకున్నారట. చిరంజీవినే నేరుగా అడిగిందట. నాకు తెలియదు డైరెక్టర్ రాఘవేంద్రరావుని అడుగు అన్నాడట చిరంజీవి. ఆ రొమాంటిక్ డైరెక్టర్ ఆ వాక్యం అర్థం ఏమిటో విజయశాంతికి చెప్పాడట. ఇంతకీ జమ్కు జమా లస్క్ టపా అంటే అర్థం ఏమిటో తెలుసా..   

PREV
16
జమ్కు జమా లస్క్ టపా మీనింగ్ ఏంటని అడిగిన విజయశాంతి... డైరెక్టర్ ని అడగమన్న చిరు, ఆయన ఏం చెప్పాడంటే?
Chiranjeevi and Vijayashanti

చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ రావడానికి ఆయన డాన్సులు ఫైట్స్ తో పాటు మేనరిజమ్స్ కూడా కారణం. 90లలో ఆయన ప్రతి సినిమాలో ఓ మేనరిజం ట్రై చేసేవారు. అవి విపరీతంగా జనాల్లోకి వెళ్ళేవి. 'చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో, ' కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో', 'బాక్సులు బద్దలైపోతాయి' వంటివి కొన్ని ఉదాహరణలు..

26
Chiranjeevi and Vijayashanti

వాటిలో జమ్కు జమా లస్క్ టపా కూడా ఒకటి. హీరోయిన్ విజయశాంతి తో చిరంజీవి పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు.  చిరంజీవి-విజయశాంతిలది హిట్ ఫెయిర్. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కాగా ఓ సినిమాలో విజయశాంతిని చూసిన వెంటనే చిరంజీవి జమ్కు జమా లస్క్ టపా... అంటాడు. 
 
36
Chiranjeevi and Vijayashanti

ఈ డైలాగ్ మీనింగ్ ఏమిటో తెలుసుకోవాలని విజయశాంతి అనుకున్నారట. చిరంజీవిని జమ్కు జమా లస్క్ టపా అంటే  ఏంటని అడిగిందట. నాకు తెలియదు. వెళ్లి డైరెక్టర్ రాఘవేంద్రరావుని అడుగు అన్నాడట చిరంజీవి. దాంతో విజయశాంతి రాఘవేంద్రరావు వద్దకు వెళ్లి జమ్కు జమా లస్క్ టపా అంటే అర్థం ఏంటని అడిగిందట. 
 
46
Chiranjeevi and Vijayashanti

దానికి రాఘవేంద్రరావు...   జమ్కు జమా లస్క్ టపా అంటే 'నీ అందచందాలకు దాసుడిని అయిపోయాను' అని అర్థం అన్నాడట. అవునా అని విజయశాంతి అన్నారట. వచ్చి చిరంజీవితో ఇదే చెప్పారట. కాసేపటి తర్వాత రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లిన చిరంజీవి జమ్కు జమా లస్క్ టపా అంటే నిజంగా అర్థం అదేనా అని అడిగాడట.

56
Chiranjeevi and Vijayashanti

లేదు జమ్కు జమా లస్క్ టపా అంటే 'నిన్ను ఎలా పడేస్తానో చూడు' అని మీనింగ్ అని రాఘవేంద్రరావు చిరంజీవితో అన్నాడట. రాఘవేంద్రరావు-చిరంజీవి గట్టిగా నవ్వుకున్నారట. నిజానికి ఆ డైలాగ్ కి ఎలాంటి మీనింగ్ లేదు. మాస్ జనాలు అమ్మాయిల వద్ద ఎక్స్ ప్రెస్ చేసే ఒక రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్ అని చెప్పొచ్చు. విజయశాంతి తప్పుగా భావించకుండా ఉండేందుకు 'నీ అందచందాలకు దాసుడను' అని రాఘవేంద్రరావు చెప్పాడు. 

66

click me!

Recommended Stories