యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై ఎంత పవర్ ఫుల్ గా, భయంకరంగా కనిపిస్తాడా రియల్ లైఫ్ లో అంత సౌమ్యంగా ఉంటాడు. అభిమానులందరికి ప్రభాస్ డార్లింగ్. కోపం అంటూ తెలియని మనిషి ప్రభాస్ అని సన్నిహితులు చెబుతుంటారు. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది అని ఫ్యాన్స్ అంటుంటారు.