తండ్రి ఎంజీఆర్ అంతటి స్టార్, అయినా కటిక దరిద్రంలో బతికిన నటి.. చివరికి తెలుగు హీరోని పెళ్లి చేసుకుని..

First Published | Nov 3, 2024, 10:19 PM IST

ఎంజీఆర్ కి సమకాలీన నటులు చాలా మంది తమిళంలో ఉన్నారు. వారిలో సీఎల్ ఆనందన్ ఒకరు. సీఎల్ ఆనందన్ తమిళంలో స్టార్ హీరో అయినప్పటికీ కుటుంబం కోసం చిల్లి గవ్వ మిగల్చలేదు.

కొంతమంది ఎంత స్టార్ స్టేటస్ పొందినప్పటికీ సంపాదన విషయంలో వెనుకబడిపోతారు. కొందరు సంపాదించినప్పటికీ దానిని నిలబెట్టుకోలేరు. అలాంటి వారిలో అప్పటి నటీనటులు ఎక్కువగా కనిపిస్తారు. మహానటి సావిత్రి, రాజబాబు లాంటి వాళ్ళు ఉన్నదంతా పోగొట్టుకుని మరణించారు. తెలుగులో స్వర్గీయ ఎన్టీఆర్ కోట్లాదిమంది అభిమానులకి ఆరాధ్య దైవంగా నిలిచారు. తమిళంలో అయితే ఎంజీఆర్. 

ఎంజీఆర్ కి సమకాలీన నటులు చాలా మంది తమిళంలో ఉన్నారు. వారిలో సీఎల్ ఆనందన్ ఒకరు. సీఎల్ ఆనందన్ తమిళంలో స్టార్ హీరో అయినప్పటికీ కుటుంబం కోసం చిల్లి గవ్వ మిగల్చలేదు. చివరి రోజుల్లో సినిమా నిర్మాణం పేరుతో ఉన్నదంతా పోగొట్టారు. సీ ఎల్ ఆనందన్ కుమార్తె ఎవరో కాదు.. తెలుగు నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి. డిస్కో శాంతికి చాలా మంది అక్క చెల్లెల్లు ఉన్నారు. 


actress disco shanti

తండ్రి ఆస్తి మొత్తం పోగొట్టి మరణించడంతో డిస్కో శాంతి తన అక్క చెల్లెళ్ళతో చిన్న గదిలో చాలా రోజులు జీవించారట. కుటుంబ భారం మొత్తం డిస్కో శాంతిపై పడింది. ఈ విషయాలని శ్రీహరి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తండ్రి మరణించే సమయానికి డిస్కో శాంతి డ్యాన్సర్ గా సౌత్ ఇండియన్ భాషల్లో గుర్తింపు తెచ్చుకుంది. చాలా చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో ఆమెకి అవకాశాలు వచ్చేవి. ఆమె సంపాదన మొత్తం ఫ్యామిలీకి సరిపోయేది. ఇండస్ట్రీకి వచ్చాక శ్రీహరికి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారిందట. 

Also Read : హీరోయిన్ బాత్రూం సన్నివేశం రచ్చ..స్టార్ హీరో తండ్రి హస్తం ఉంది, డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్

ఒక రోజు ఆమెని కలుద్దామని శ్రీహరి డిస్కో శాంతి ఇంటికి వెళ్లారు. అప్పుడు శ్రీహరికి అసలు విషయం తెలిసింది. డిస్కో శాంతి పాపులర్ డ్యాన్సర్ అయినప్పటికీ కుటుంబంతో కటిక దరిద్రం అనుభవిస్తోంది అని శ్రీహరికి అర్థం అయిందట. ఆమెకి ఉన్న క్రేజ్ కి ఆమె అనుభవిస్తున్న కష్టాలకి ఏమాత్రం పోలికలేదు. కానీ ముఖం మీద చిరునవ్వు కోల్పోకుండా కష్టపడేది. ఆమె మనస్తత్వం నాకు బాగా నచ్చింది. అందుకే ఒక రోజు ధైర్యం చేసి ఒక రోజు అడిగా. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పా. 

actress disco shanti

డిస్కో శాంతి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఆ తర్వాత పెళ్ళికి అంగీకారం తెలిపింది. కానీ శ్రీహరి ఒక కండిషన్ పెట్టారు. పెళ్లి ఇప్పుడే వద్దు.. ఐదారేళ్ళ తర్వాత చేసుకుందాం. ఎందుకంటే నువ్వు నా ఇంట్లోకి వచ్చే సరికి నీకు ఎలాంటి కష్టాలు ఉండకూడదు. సొంత ఇల్లు ఉండాలి, కార్లు , అన్ని లగ్జరీలు ఉండాలి. నిన్ను మహారాణిలా చూసుకోవాలి. అంత డబ్బు సంపాదించాలి. నువ్వు నా ఇంట్లోకి కట్టు బట్టలతో వచ్చేయ్ చాలు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించినది మొత్తం నీ ఫ్యామిలీకి ఇచ్చేయ్ అని చెప్పా. అందుకు ఓకె చెప్పింది. ఆ ఐదారేళ్ళ పాటు వారానికి ఒకసారి కలుసుకునేవాళ్ళం. అప్పట్లో ఇండస్ట్రీలో చాలా మంది.. శ్రీహరి చాలా కన్నింగ్.. ఆమె సంపాదన మొత్తం దోచేస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. కానీ వాస్తవం వాళ్ళకి తెలియదు అంటూ శ్రీహరి అన్నారు. 

డిస్కో శాంతిని పెళ్లి చేసుకుకునే సమయానికి శ్రీహరి విలన్ గా టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. డిస్కో శాంతి, శ్రీహరి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. శ్రీహరి 2014లో అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. డిస్కో శాంతి ఘరానామొగుడు చిత్రంలో బంగారు కోడి పెట్ట, రౌడీ అల్లుడు చిత్రంలో అమలాపురం బుల్లోడా లాంటి సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ చేసింది. 

Latest Videos

click me!