సడెన్‌గా ఎన్టీఆర్‌ బామ్మర్ది, హీరో నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అభయ్‌, భార్గవ రామ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Published : Nov 03, 2024, 07:02 PM ISTUpdated : Nov 03, 2024, 07:04 PM IST

ఎన్టీఆర్‌ బామ్మర్ది త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. `మ్యాడ్‌`, `ఆయ్‌` చిత్రాలతో అలరించిన నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఆదివారం గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. 

PREV
15
సడెన్‌గా ఎన్టీఆర్‌ బామ్మర్ది, హీరో నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌..  అభయ్‌, భార్గవ రామ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బామ్మర్ది నార్నే నితిన్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. `మ్యాడ్‌` సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన ఇటీవల `ఆయ్‌` సినిమాతో సోలో హీరోగా విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్‌ సాధించాయి. ఇప్పుడు `మ్యాడ్‌ 2`తో రాబోతున్నాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

ప్రస్తుతం నార్నే నితిన్‌ చేతిలో రెండు మూడు సినిమాలున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమాలు చేస్తున్న క్రమంలోనే సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నారు. తాజాగా ఎంగేజ్‌మెంట్‌ జరగడం విశేషం. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ శివానీతో జరిగింది. బంజరాహిల్స్ లో వీరి ఎంగేజ్‌మెంట్ జరగడం విశేషం. ఫ్యామిలీ మెంబర్స్ అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే ఈ నిశ్చితార్థం జరిగింది.
 

35

ఇందులో ఎన్టీఆర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. నార్నే నితిన్‌.. తారక్‌ భార్య లక్ష్మి ప్రణతీ తమ్ముడు కావడం విశేషం. దీంతో తారక్‌ అంతా ముందుండి నడిపిస్తున్నాడని చెప్పొచ్చు. ఈ ఎంగేజ్‌మెంట్‌లో తారక్‌ పిల్లలు మరింత ఆకర్షణగా నిలిచారు. అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌లు సందడి చేశారు. చిన్న కొడుకు ఎంతో క్యూట్‌గా ఉండి ఆకట్టుకుంటున్నాడు. ఇందులో లైట్‌ పిక్‌, వైట్‌ కలర్‌ డ్రెస్సుల్లో ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, భార్య మెరిశారు. అందరి దృష్టిని ఆకర్షించారు.
 

45

నార్నే నితిన్‌ చేసుకోయే అమ్మాయి శివాజీ.. తల్లూరి వెంకట కృష్ణ ప్రసాద్‌, తల్లూరి స్వరూపల కూతురు శివాని. అలాగే నార్నే శ్రీనివాస్‌, నార్నే మల్లీక ల కొడుకు నార్నే నితిన్‌ అనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ వైఫ్‌ ప్రణతి పెద్దది కాగా, నితిన్‌ చిన్నవాడు. అయితే హీరోయిన్‌గా పరిచయం కనీసం ఏడాది కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది. అయితే లవ్‌ మ్యారేజా అనేది తెలియాల్సి ఉంది. వీరి మ్యారేజ్‌కి కళ్యాణ్‌ రామ్‌ కూడా హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. త్వరలోనే వీరి మ్యారేజ్‌ ఉంటుందని తెలుస్తుంది. 
 

55

ఎన్టీఆర్‌ ఇటీవలే ఆయన `దేవర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుంది. అందుకోసం కొత్త మేకోవర్‌లోకి మారబోతున్నట్టు తెలుస్తుంది. 

read more: రెండు వేల కోట్ల కలెక్షన్ల సత్తా ఉన్న ప్రాజెక్ట్ లకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌, ఇక ముందున్నదంతా అరాచకమే

also read: పెళ్లై పిల్లలున్నా సరే, ఆ స్టార్‌ హీరోనే కావాలి.. పెద్ద గొడవ చేసిన హీరోయిన్‌ రాశీ

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories