హీరోయిన్ బాత్రూం సన్నివేశం రచ్చ..స్టార్ హీరో తండ్రి హస్తం ఉంది, డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్

First Published | Nov 3, 2024, 8:57 PM IST

సినిమాల్లో హీరోయిన్ కి సంబంధించిన చాలా సన్నివేశాలు వివాదం అవుతుంటాయి. ఫ్యామిలీలకు ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటే సెన్సార్ వాళ్ళు తప్పకుండా అడ్డు చెప్పడం, కత్తెర్లు వేయడం చేస్తారు.

సినిమాల్లో హీరోయిన్ కి సంబంధించిన చాలా సన్నివేశాలు వివాదం అవుతుంటాయి. ఫ్యామిలీలకు ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటే సెన్సార్ వాళ్ళు తప్పకుండా అడ్డు చెప్పడం, కత్తెర్లు వేయడం చేస్తారు. ఒకప్పుడు హీరోయిన్లు గ్లామర్ షో అంటే హద్దుల్లో ఉండేవారు. నగ్మ, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లు మాత్రం స్కిన్ షో ఎక్కువగా చేసేవారు. 

అయితే అతి పైన వయసులో హీరోయిన్ అయిన నటి దివ్య భారతి కూడా అప్పట్లో గ్లామర్ ప్రదర్శించింది. కేవలం 19 ఏళ్ళ పిన్న వయసులోనే దివ్య భారతి మరణించిన సంగతి తెలిసిందే. కానీ సినిమాల్లో నటించినన్ని రోజులు ఒక ఊపు ఊపింది. దర్శకులు నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ కోసం వెంటపడ్డారు. 1990లో దివ్య భారతి విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ చిత్రంలో దివ్యభారతి క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ అందరిని తెగ ఆకర్షించాయి. 


ఆ వెంటనే మోహన్ బాబుతో కలసి అసెంబ్లీ రౌడీ చిత్రంలో నటించింది. అది కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో అసెంబ్లీ రౌడీ ఒకటి. ఈ రెండు చిత్రాలకు డైరెక్టర్ బి గోపాల్ కావడం విశేషం. అప్పట్లో దివ్య భారతి ఈ చిత్రాల్లో గ్లామర్ కనిపించడం, కొన్ని సన్నివేశాల్లో నటించడంపై పెద్ద చర్చే జరిగింది. 

బొబ్బిలి రాజా చిత్రంలో జాకెట్ సన్నివేశం ఉంటుంది. అసలు ఆ సన్నివేశాన్ని అప్పట్లో సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అని అంతా షాక్ అయ్యారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో దివ్య భారతి బాత్రూం సన్నివేశంపై కూడా పెద్ద రచ్చే జరిగింది. ఈ సన్నివేశాలని సెన్సార్ వాళ్ళు ఎలా అనుమతించారు అనేది పెద్ద మిస్టరీ. ఎట్టకేలకు ఆ సన్నివేశాలు ఓకె కావడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో డైరెక్టర్ బి గోపాల్ రివీల్ చేశారు. 

సెన్సార్ సమస్యలు ఏమైనా ఉంటే రామానాయుడు గారు మేనేజ్ చేసేవాళ్ళు. బొబ్బిలి రాజా చిత్రంలో జాకెట్ సన్నివేశాన్ని రామానాయుడు గారు సెన్సార్ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేశారు. ఆయన చెబితే ఇక తిరుగులేదు. సెన్సార్ వాళ్ళు ఆయన మాట వినేవారు. అదే విధంగా అసెంబ్లీ రౌడీ చిత్రంలో బాత్రూం సన్నివేశాన్ని మోహన్ బాబు గారు మేనేజ్ చేసినట్లు బి గోపాల్ తెలిపారు. 

Latest Videos

click me!