Junior NTR
లెజెండ్ ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ స్టార్ అయ్యారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రత్యేకం. ఎన్టీఆర్ రూపం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. తాతయ్య పేరు పెట్టుకున్నందుకు ఆయన లెగసీని ముందుకు తీసుకెళుతున్నాడు.
కాగా ఓ ఇంటర్వ్యూలో తాతయ్య ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి తాత ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన అనుభవం ఆయన షేర్ చేశారు. ఆ ఇంటి ఆవరణలో, చెట్టులో, ఆకులో, గాలిలో దైవత్వం ఉన్న భావన కలిగిందట. ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన కాషాయ వస్త్రాల్లో జపం చేస్తూ కనిపించాడట. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను చూసి.. రండి అని అన్నారట.
Junior NTR
జూనియర్ ఎన్టీఆర్ ని తాతయ్య ఏం పేరు అని అడిగాడట. తారక్ రామ్ అని సమాధానం చెప్పాడట. హరికృష్ణ పెద్ద కొడుకుల పేర్లు జానకి రామ్, కళ్యాణ్ రామ్ కాగా, జూనియర్ కి తారక్ రామ్ అని పెట్టాడట. అయితే తారక్ రామ్ కాదు, నందమూరి తారక రామారావు అని పేరు మార్చమని ఎన్టీఆర్ తన కొడుకు హరికృష్ణకు సూచించాడట. అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు, అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
Junior NTR
అప్పటి నుండి ఒక ఏడాది పాటు ప్రతిరోజూ తాతయ్యను జూనియర్ ఎన్టీఆర్ కలిసేవాడట. తన మీద ఎన్టీఆర్ ప్రత్యేకమైన అభిమానం చూపించేవాడట. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో ఆయనతో పాటు నటించే అవకాశం నాకు దక్కింది. తాతయ్యతో నటించిన ఏకైక మనవడిని నేను అని జూనియర్ ఎన్టీఆర్ గొప్పగా చెప్పుకున్నాడు.
ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని ని ఎన్టీఆర్ ఇంటికి పిలిపించారట. షాలిని తో ఎన్టీఆర్... ఇన్నాళ్లు దూరంగా బ్రతికాము. ఆ విషయాన్ని వదిలేయండి. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటి వాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తాను... అని అన్నాడట. ఇది జరిగిన కొన్ని రోజులకు ఎన్టీఆర్ మరణించారట.
తన వంతు బాధ్యత నెరవేరుస్తాను అని చెప్పి, అది చేయకుండానే వెళ్లిపోయాడని తాత మీద జూనియర్ ఎన్టీఆర్ కి కోపం వచ్చిందట. అయితే తర్వాత తనకు అర్థమైందట. తన రూపం, తన పేరు ఇవ్వడం ద్వారా తాతయ్య తన బాధ్యత ఆల్రెడీ పూర్తి చేశాడని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారట. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో జూనియర్ ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేశాడు...