`సరిపోదా శనివారం` బిజినెస్ కు 'మిస్టర్ బచ్చన్' దెబ్బ?

First Published | Aug 19, 2024, 4:57 PM IST

 ‘సరిపోదా శనివారం’ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో సరిపోదా శనివారంగా రాబోతుండగా.. 

Saripodhaa Sanivaaram

 సినిమా పీల్డ్ లో లెక్కలు చిత్రంగా ఉంటాయి. ఓ సినిమా హిట్టైతే మిగతా సినిమాలకు సంభందం లేకపోయినా ఊపు వచ్చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్,బయ్యర్లు ఇండస్ట్రీ కళకళ్లాడిపోతుందని ఆ క్షణం నుంచే నమ్మేస్తారు. మంచి రేటు ఇచ్చి మిగతా సినిమాలు కొనేస్తారు. నిర్మాతలు సినిమాలు మొదలెట్టేస్తారు. అదే ఓ సినిమా డిజాస్టర్ అయితే ట్రేడ్ మొత్తం చల్లారిపోతుంది. ప్రతీ సినిమాని అనుమానంగా చూస్తూ కొనాలా వద్దా అనే ఆలోచనలో పడిపోతారు. రీసెంట్ గా ఆగస్టు 15 కు వచ్చిన తెలుగు సినిమాలు డిజాస్టర్ అవ్వటం త్వరలో రిలీజ్ కాబోయే సినిమాలపై ఇంపాక్ట్ పడుతోంది. 

Saripodha Sanivaaram

మొన్న ఆగస్ట్ 15 న రవితేజ మిస్టర్ బచ్చన్ , రామ్ డబుల్ ఇస్మార్ట్ రెండు చిత్రాలు వచ్చాయి. రెండింటిలో దేనికీ చెప్పుకోదగ్గ టాక్ రాలేదు. అయితే డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ అయిన లెక్కలు వేరు. లైగర్ తలనొప్పులు ఉండటంతో అడ్వాన్స్ లు ఇచ్చి సినిమాని తీసుకోలేదు. దాంతో ఎగ్జిబిటర్స్ కు పెద్ద సమస్యగా మారలేదు. అయితే  మిస్టర్ బచ్చన్ మాత్రం మంచి క్రేజ్ తో బిజినెస్ చేసారు. మిస్టర్ బచ్చన్ సినిమాని అడ్వాన్స్ లు పే చేసి ఎగ్జిబిటర్స్ తీసుకున్నారు. వారంతా నష్టపోవటం అనేది ప్రక్కన పెడితే ఇప్పుడు మిగతా సినిమాలపై పెట్టడానికి  డబ్బులు రొటేషన్ కు ఇబ్బంది పడే సిట్యువేషన్ ఏర్పడింది.


‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) చిత్రానికి రూ.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.34 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.7.19 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.26.81 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. దాంతో మిస్టర్ బచ్చన్ అడ్వాన్స్ లు ఎఫెక్ట్ ...నాని సినిమా ‘సరిపోదా శనివారం’ మీద పడుతోంది అని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేద్దామంటే తమ అడ్వాన్స్ లు   మిస్టర్ బచ్చన్ లో ఇరుక్కుయాని, అడ్వాన్స్ లు లేకుండా సినిమా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు. ఇది సరిపోదా శనివారం నిర్మాతకు సమస్యగా మారిందని అంటోంది ట్రేడ్. 

Saripodhaa Sanivaaram

ఇక దసరా, హాయ్ నాన్న బ్యాక్ టు బ్యాక్ హిట్లతో  సూపర్ ఫామ్ లో ఉన్న నానీ తాజా చిత్రం సరిపోదా శనివారం.  డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ దర్శకుడుతో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం చేసారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాకపోయినా ఫ్యామిలీలకు బాగానే నచ్చింది. ఇప్పుడు రూట్ మార్చి మాస్ ఆడియన్స్ కోసం సరిపోదా శనివారం చిత్రం తెస్తున్నారు. పోస్టర్స్, టీజర్స్ లో ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచానాలే ఉన్నాయి.

 ‘సరిపోదా శనివారం’ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో సరిపోదా శనివారంగా రాబోతుండగా.. మిగిలిన భాషల్లో డబ్ కాబోతుంది. అలాగే సూర్యస్ సాటర్ డే పేరుతో రాబోతోన్నట్లు తెలుస్తుంది. ఎస్ జెసూర్య, అభిరామి, ఆదితి బాలన్, పి సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్, అజయ్ ఘోష్, శుభలేక సుధాకర్ నటించారు.హిందీ, మలయాళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ కానుంది. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. 

Latest Videos

click me!