ఇంద్ర రీ రిలీజ్ తో పాటు మరో బిగ్ సర్ప్రైజ్.. మెగా ఫ్యాన్స్ కి పండగే..

First Published | Aug 19, 2024, 5:16 PM IST

జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు అలాంటి ఫాంటసీ చిత్రం చేయలేదు. మధ్యలో అంజి వచ్చింది కానీ ఆకట్టుకోలేకపోయింది. చాలా ఎల్లా తర్వాత చిరంజీవి ఆ తరహా ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు అలాంటి ఫాంటసీ చిత్రం చేయలేదు. మధ్యలో అంజి వచ్చింది కానీ ఆకట్టుకోలేకపోయింది. చాలా ఎల్లా తర్వాత చిరంజీవి ఆ తరహా ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు.. అదే విశ్వంభర చిత్రం. బింబిసార ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కుతోంది. సాధారణ వ్యక్తిగా కనిపించే చిరంజీవి ముల్లోకాల నుంచి మెప్పు పొందే వీరుడిగా ఈ చిత్రంలో మారతారట. చిరు ఏవిధంగా వీరుడిగా మారుతారు  అనేది కథలో కీలకం. 

మరో రెండు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా విశ్వంభర చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్ కి అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేసింది. చిరు బర్త్ డే రోజున విశ్వంభర టీజర్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 


దీనితో విశ్వంభర చిత్ర యూనిట్ క్రేజీ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎలాగు ఇంద్ర రీరిలీజ్ అవుతోంది కాబట్టి ఇంద్ర 4కె ప్రింట్లతో విశ్వంభర టీజర్ ని అటాచ్ చేయబోతున్నారట. 

Vishwambhara

అంటే ఇంద్ర ప్రదర్శించే థియేటర్స్ లో విశ్వంభర టీజర్ సందడి కూడా ఉండనుంది. అంటే మెగా అభిమానులకు డబుల్ ధమాకా. అయితే దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది. ఇది కనుక నిజమైతే మెగాస్టార్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ట్రీట్ లభించినట్లే. 

Latest Videos

click me!