రాజశేఖర్, శంకర్ కాంబినేషన్‌లో రావాల్సిన మూవీ ఏంటో చూస్తే, అది `జెంటిల్‌మేన్`. అర్జున్ చేసిన ఈ చిత్రాన్ని మొదట దర్శకుడు శంకర్ రాజశేఖర్‌కి కథ చెప్పాడట. ఆయన అయితేనే బాగా సూట్ అవుతాడని, ఆయనలోని ఆవేశం సినిమాకి, పాత్రకు బాగా సెట్ అవుతుందని భావించారు. ఈ కథ విన్న రాజశేఖర్ కూడా బాగానచ్చిందని, కానీ తాను చేయలేనని చెప్పాడట.
కారణం ఆ సమయంలో `అల్లరి ప్రియుడు` సినిమా చేస్తున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేసుకొని చేయాల్సింది, కానీ దర్శక, నిర్మాతలకు చెప్పలేకపోయాడు. ఈ మూవీకే బల్క్ డేట్స్ ఇచ్చాడట. తర్వాత చేద్దామంటే శంకర్ ఒప్పుకోలేదు, వెంటనే చేయాలి. కానీ డేట్స్ సెట్ కావడం లేదు.