అప్పట్లో అత్యంత బిజీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రంభ. ఓ వైపు రమ్యకృష్ణ, సౌందర్య, మీనా, నగ్మా వంటి కథానాయికలు జోరు మీదున్నారు. వాళ్లు బాగా నటిస్తారు, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటారు. వాళ్లని తట్టుకుని నిలబడటం అంటే మామూలు విషయం కాదు, కానీ రంభ నిలబడింది.
ఇంకా చెప్పాలంటే వాళ్లందరికి పోటీ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లోవాళ్లంతా కుళ్లుకునేలా చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ పరిశ్రమలను షేక్ చేసింది. కరెక్ట్ గా పదేళ్లు ఆమె ఇండస్ట్రీలో ఉంది.
వందకు పైగా సినిమాలు చేసింది. ఏడాదికి పదికిపైగా సినిమాలు ఆమె నుంచి వచ్చేవంటే రంభ ఎంత బిజీగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి వంటి బిగ్ స్టార్స్ సైతం రంభ డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులున్నాయి. నాగార్జున వంటి హీరోకి డేట్స్ ఇవ్వలేకపోయ్యింది రంభ.