వైట్ డ్రెస్ లో త్రిష బ్యూటీఫుల్ లుక్.. చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తున్న సీనియర్ నటి.. పిక్స్

First Published | Apr 4, 2023, 4:36 PM IST

కోలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తెగ సందడి చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు  పెంచిన ఈ ముద్దుగుమ్మ ఆయా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది.  తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది.
 

 సీనియర్ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో బడా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు సరసన నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’తో మళ్లీ భారీ క్రేజ్ సందపాదించుకుంది. అప్పటి నుంచి కోలీవుడ్ తెగ సందడి చేస్తోంది. 
 


పొన్నియిన్ సెల్వన్ 2 విడుదలకు సిద్ధంగా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. PS1లో కుందవైగా ఆకట్టుకున్న త్రిష PS2 ప్రమోషన్స్ లో సంప్రదాయ దుస్తుల్లో రాయల్ లుక్ లో ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఆకట్టుకుంది.
 

ఇక తాజాగా కోలీవుల్ లో నిర్వహించిన బిహైడ్ వుడ్స్ గోల్డ్ ఐకాన్స్, జేఎస్ డబ్ల్యూ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలకు హాజరైంది. బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో  ఇన్ స్టా వేదికన పంచుకుంది. తనకు అవార్డు అందించిన సంస్థలకు ధన్యవాదాలు తెలిపింది.  
 

అయితే, ఈ ఈవెంట్ కు హాజరైన త్రిష స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చి అందరి చూపు తనపైనే పడేలా చేసింది. దాదాపుగా నాలుగు పదుల వయస్ససులోనూ త్రిష ఇంత అంతంగా మెరియడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

త్రిష స్టిల్స్ కు, గ్లామర్ సొగసులకు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం త్రిష లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. విజయ్ దళపతి హీరోగా నటిస్తుండగా.. త్రిష ఆయనకు జోడీగా నటిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ కొనసాగుతోంది. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముుందుకు రానుంది. 
 

Latest Videos

click me!