నటి సమీరా రెడ్డి డైట్ ప్లాన్ ఏంటో తెలుసా? కొన్నేళ్ల సీక్రెట్ ను రివీల్ చేసిన ఎన్టీఆర్ హీరోయిన్

First Published | Mar 31, 2023, 5:31 PM IST

సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy) సినిమాలకు దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. తాజాగా తన డైట్ ప్లాన్ ను రివీల్ చేశారు. 
 

నటి సమీరా రెడ్డి హీరోయిన్ గా హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, చిరంజీవి సరసన నటించి ఇక్కడి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకొని సినిమాకు గుడ్ బై చెప్పింది. 

2013 తర్వాత సమీరా రెడ్డి మళ్లీ వెండితెరపై మెరవలేదు. సినిమాలకు దూరం కావడంతో అభిమానులు కాస్తా అప్సెట్ అయ్యారు. కానీ సమీరా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు. తన ఫ్యామిలీ విషయాలతో పాటు తను ప్రమోట్ చేసే బ్రాండ్, బర్నింగ్ అంశాలపైనా స్పందిస్తుంటారు.
 


ఇక తాజాగా సమీరా రెడ్డి తన ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిపారు. హెల్తీగా, ఫిట్ గా ఉండేందుకు తనేం చేస్తారో వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ డైట్ పడితే అది చేయకూడదని వివరించారు. ముందుగా మనం ఆహార నియమాలను అలవాటు చేసుకోవాలన్నారు.
 

మన శరీరం కోరుకునే దాన్ని భోజనంగా తీసుకోవాలి. నేను మాత్రం అదే ఫాలో అయ్యాను. చిన్నప్పటి నుంచి నేను డ్రైఫ్రూట్స్ తినేదాన్ని. మా నాన్న మాకు అలవాటు చేశారు. నేనూ నా పిల్లలకూ రుచి చూపించాను. దాంతో వాళ్లూ హెల్తీగా ఉంటారని భావిస్తున్నాను. వారే నా ప్రపంచం. 
 

ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే తల్లి కాకముందు, గర్భధారణ సమయంలోనూ.. పిల్లలకి జన్మనిచ్చాక కూడా మన ఆరోగ్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి‘ అంటూ చెప్పుకొచ్చారు. 

ఇక  2016లో సమీరా రెడ్డి ‘అలోపేసియా’ వ్యాధికి గురైంది. దాంతో తన చుట్టును కోల్పోయింది. ఈ విషయాన్ని గతేడాది ఆస్కార్ వేదికలో విల్ స్మిత్ చెంపదెబ్బ ఘటన సందర్భంగా సమీరా రెడ్డి వివరించింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు సమీరా. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ తన పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. 

Latest Videos

click me!