డైలాగ్ డెలివరీ ఎమోషన్ పర్ఫెక్ట్ గా కుదరడంతో దసరా చిత్రం విజయం సాధించింది. గత మూడేళ్ళుగా నానికి నిఖార్సైన బాక్సాఫీస్ సక్సెస్ లేదు. అన్ని చిత్రాలు బావున్నాయి అంటున్నారు కానీ కలెక్షన్స్ రాక ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మూడేళ్ళ క్రితం నాని నటించిన జెర్సీ మాత్రం హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికీ చిత్రాలు కమర్షియల్ సక్సెస్ కాలేదు.