నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా రూపొందించిన చిత్రం 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా, నిన్న ఒక్క రోజులోనే 38 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇంతవరకూ తాను కనిపించిన దానికి భిన్నంగా .. తనకి గల క్రేజ్ కి భిన్నంగా ఈ సినిమాలో నాని కనిపించాడు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, దీక్షిత్ శెట్టి కీలకమైన పాత్రను పోషించాడు. ఇక ఈ చిత్రంలో కథ లేదంటూనే ... రామాయణ,మహాభారతాలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ని తీసుకుని చేసారంటున్నారు. అదెలాగంటే..